AP High Court: టీడీపీ నేతల గృహనిర్బంధం పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో నిరసనలు తెలుపుతున్న టీడీపీ నేతల గృహానిర్బంధం పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఆ పార్టీ నేతలను గృహనిర్బంధం చేయడంపై వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే ప్రతిపక్షాలను, ముఖ్యంగా టీడీపీ నేతలను టార్గెట్ చేస్తోందని పిటిషనర్ వాదనలు వినిపించారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారని కోర్టు దృష్టికి పిటిషనర్ తరుపు న్యాయవాది యలమంజుల బాలాజీ తీసుకువచ్చారు. గృహ నిర్బంధం చేయడం చట్టవ్యతిరేకమైన చర్యని న్యాయవాది బాలాజీ తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, 21కు ఈ చర్యలు విరుద్ధమని ఆయన కోర్టుకు విన్నవించారు. సుప్రీంకోర్టు నిబంధనలు ప్రభుత్వం ఉల్లంగిస్తోందని బాలాజీ వాదనలు వినిపించారు. ప్రభుత్వం వివక్ష పాటిస్తోందని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు.అధికార పార్టీ కార్యక్రమాలకు అనుమతులు ఇస్తూ… ప్రతిపక్షాలకు అనుమతులు నిరాకరిస్తోందని వాదించారు.
Also Read: Central Cabinet: నేడు కేంద్ర కేబినెట్ కీలక సమావేశం
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
న్యాయవాది బాలాజీ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. కౌంటర్ ధాఖలు చేసేందుకు ప్రభుత్వం రెండు వారాల సమయం కోరింది. సీయస్, డీజీపీ, హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!