Pakistan: సాధారణంగా పెద్ద వయస్సులో ఉన్న వాళ్లను పెళ్లి చేసుకోవడం గురించి చాలా సార్లు వినే ఉంటారు. అయితే ఈ సారి మాత్రం ఓ యువకుడు 70 ఏళ్ల వయస్సు గల బామ్మను పెళ్లి చేసుకున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది పచ్చినిజం. ఈ పెళ్లి పాకిస్థాన్‌లో జరిగింది. 35 ఏళ్ల నయీమ్ షాజాద్ తన వయసు కంటే రెండింతలు.. అంటే 70 ఏళ్ల మేరీని పెళ్లి చేసుకున్నాడు. మేరీ కెనడా నివాసి కావడంతో ఫేస్‌బుక్‌లో ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. అలా మొదలైన ప్రేమ పెళ్లివరకు వెళ్లింది. ఎట్టకేలకు వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. కెనడా వీసా కోసమే నయిమ్ ఆమెను పెళ్లి చేసుకున్నాడని కొంతమంది ఆరోపణలు చేశారు. అయితే ఈ విషయాన్ని నయీం స్పష్టంగా ఖండించాడు. ప్రేమతోనే ఆమెను పెళ్లాడినట్లు తెలిపాడు.
Also Read: Putin: అక్టోబర్‌లో పుతిన్ చైనా పర్యటన.. అమెరికా వ్యతిరేకులతో చెట్టాపట్టాలు
2012 సంవత్సరంలో స్నేహం
2012లో వారిద్దరూ ఫేస్‌బుక్‌లో స్నేహితులుగా మారారని పాకిస్థాన్‌లోని గుజరాత్‌కు చెందిన నయీమ్ చెప్పాడు. మేరీ 2015 సంవత్సరంలో అతనికి ప్రపోజ్ చేసింది. వారిద్దరూ 2017 ఆగస్టులో పెళ్లి చేసుకున్నారు. అయితే, నయీం వీసా సంబంధిత సమస్యలను ఎదుర్కొన్నాడు. కెనడాలో ఇద్దరూ కలిసి జీవించలేకపోయారు. ఆరేళ్ల తర్వాత తొలిసారి పాకిస్థాన్‌లో పర్యటించిన మేరీ.. ఆరు నెలల పాటు నయీమ్‌తో కలిసి ఉండాలని ప్లాన్ చేసింది. మేరీని కలిసినప్పుడు మానసికంగా ఇబ్బంది పడ్డానని నయీమ్ చెప్పాడు. మేరీ అతనికి మానసికంగా, ఆర్థికంగా మద్దతు ఇచ్చింది. అంతేకాకుండా ఆమె నిరాడంబరమైన పెన్షన్‌తో జీవించినట్లు తెలిసింది. తమ మధ్య వయోభేదం ఉన్నా తాను పట్టించుకోనని నయీమ్ తెలిపాడు. ఇప్పుడు మేరీ తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అని నయీం అంటున్నాడు.
Also Read: Kangana Raunat : కొత్త పార్లమెంట్ భవనంలో బాలివుడ్ తారలు..మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రశంసలు..
నయీమ్ ఎందుకు ప్రేమలో పడ్డాడు?
కొంతమంది నయీమ్‌ను అత్యాశపరుడని, వీసా కోసమే అతను పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను నయీమ్ ఖండించారు. అతను మేరీని వివాహం చేసుకున్న సమయంలో నిరాశకు గురయ్యానని, ఇతర మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న సందర్భంలో ఆమె తనకు చేయూతను అందించిందని నయీం చెప్పాడు. మేరీ ప్రతి సమస్యపై బహిరంగంగా మాట్లాడగలిగే వ్యక్తి అంటూ అతను తెలిపాడు. ఆమెకు తాను అన్ని విధాలుగా మద్దతు ఇచ్చానని, ఆ తర్వాత ఆమె తన ప్రేమలో పడిందని నయీం చెప్పాడు. తమ ఇంట్లో విలాసవంతమైన వస్తువులు లేవని, ఇద్దరం సాధారణ జీవితం గడుపుతున్నామని మేరీ చెప్పారు. ప్రజలకు ఏది కావాలంటే అది చెప్పే స్వేచ్ఛ ఉందన్నారు. ఆ విషయాలను నయీమ్ పట్టించుకోడని ఆమె వెల్లడించారు.