టీడీపీ అధినేత చంద్రబాబుకు సోమవారం అత్యంత కీలకంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేసులకు సంబంధించి కోర్టుల్లో ముఖ్యమైన తీర్పులు రేపే వెల్లడికానున్నాయి. విజయవాడ ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు వరకు దాఖలు చేసిన పలు పిటిషన్లపై తీర్పులు, విచారణలు రేపే ఉండడం గమనార్హం.
జడ్చర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో మండల పరిధిలోని గోప్లపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుర్రాల నర్సింహులు, మల్లెపోగు యాదయ్య, శివతో పాటు 30 మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
సిద్దిపేట జిల్లాలోని ఓ గ్రామ శివారులో దాదాపు 100 కోతుల మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మునిగడపకు చెందిన కొందరు గ్రామస్థులు శనివారం తమ పొలాల సమీపంలో కోతులు మృతి చెందడం చూసి స్థానిక అధికారులకు సమాచారం అందించారు.
ప్రముఖ నటుడు, టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కూకట్‌పల్లి నుంచి బరిలోకి దిగుతున్నట్లు.. కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనతో ఇప్పటికే చర్చలు జరిపిందని, ఆయన కూడా అందుకు ఓకే చెప్పారంటూ వార్తలు వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై తాజాగా బండ్ల గణేశ్ ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) వేదికగా స్పందించారు.
హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది. శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు భారీ సంఖ్యలో రాకెట్లతో దాడి చేశారు. ఇజ్రాయెల్ వైపు నుంచి ప్రతీకార చర్య కూడా వచ్చింది. ప్రస్తుతం చాలా మంది భారతీయ పౌరులు ఇజ్రాయెల్‌లో ఉన్నారు.
బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి ఢిల్లీకి బయలుదేరారు. హస్తినలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు నేతలను పురంధేశ్వరి కలవనున్నారు. రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలను ఢిల్లీ పెద్దలకు పురంధేశ్వరి వివరించనున్నట్లు తెలుస్తోంది.
పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణకు ప్రమాదం తప్పింది. గోరంట్లలో బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యేపై ఓ ఆగంతకుడు డిటోనేటర్ విసిరాడు. గోరంట్ల మండలం గడ్డం తండా వద్ద 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శంకరనారాయణ నిర్వహించారు.