స్కిల్ స్కాంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నేరం జరగలేదగని చంద్రబాబు నిరూపించగలరా అంటూ ప్రశ్నించారు. ఊరు, పేరు లేకుండా అగ్రిమెంట్ తయారు చేశారని మండిపడ్డారు.
రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 23న రాజస్థాన్‌లో పోలింగ్ జరగనుంది. అదే రోజు దేవ్ ఉథాని ఏకాదశి కావడం గమనార్హం. అంటే ఆ రోజు రాష్ట్రంలో 50,000 కంటే ఎక్కువ వివాహాలు జరిగే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా కులగణనకు ఇవాళ సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై మాట్లాడుతూ.. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని రాహుల్ వ్యాఖ్యానించారు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. హమాస్‌పై ఇజ్రాయెల్ బాంబు దాడులు కొనసాగుతున్నాయి. రెండు దేశాల మధ్య మొదలైన యుద్ధం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల ఆందోళనను పెంచింది.
హమాస్, ఇజ్రాయెల్ మధ్య ఖైదీల మార్పిడికి ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు ఉగ్రవాద గ్రూపులోని ఒకరు తెలిపినట్లు తెలిసింది. అమెరికా మద్దతుతో, ఖతార్ ఒప్పందాన్ని వెంటనే పూర్తి చేయాలని కోరుకుంటోంది.
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ఇజ్రాయెల్ ప్రజలపై చేసిన క్రూరమైన దాడులను ఖండించిన ఒక రోజు తర్వాత, సోమవారం పాలస్తీనియన్లకు మద్దతుగా కాంగ్రెస్ బహిరంగంగా ముందుకు వచ్చింది.
తమిళనాడులోని అరియలూరు జిల్లాలో సోమవారం (అక్టోబర్ 9) బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది మరణించారు. 10 మంది మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం నగదు సాయం ప్రకటించారు.
ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ గురించి చాలా మంది కథలు కథలుగా చెప్పుకుంటారు. వీటిలో కొన్ని కథలు ఆశ్యర్యాన్ని కలిగిస్తే, మరికొన్ని వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ప్రపంచంలోనే శక్తివంతమైన గూఢచర్యల్లో సంస్థల్లో మొసాద్ కూడా ఒకటి కావడం గమనార్హం.
జర్మనీలోని హాంబర్గ్ విమానాశ్రయం ఇరాన్ నుంచి వచ్చిన విమానానికి బెదిరింపు రావడంతో సోమవారం అన్ని విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌ను నిలిపివేసింది. కొన్ని గంటల తర్వాత బెదిరింపుకు ప్రతిస్పందనగా పోలీసు ఆపరేషన్ తర్వాత ఎయిర్‌పోర్టు తిరిగి కార్యకలాపాలను ప్రారంభించింది.