అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీహార్‌లో జరిగిన తరహాలో రాష్ట్రంలో కూడా కులాల సర్వే నిర్వహిస్తామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు.
ఎర్రకోట నుంచి చేసిన ప్రకటనలను నెరవేర్చడంలో ప్రధాని బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట ప్రసంగంలో చేసిన ప్రకటనలను సమీక్షించేందుకు ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించారు.
మూడు సర్వీసుల కోసం అమలవుతున్న కొత్త వికలాంగుల పెన్షన్ విధానంపై లేవనెత్తుతున్న ప్రశ్నలు నిరాధారమైనవని పేర్కొన్న సైన్యం.. మాజీ సైనికులు, యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన సైనికుల వితంతువుల పింఛన్లపై ఎటువంటి ప్రభావం చూపదని పేర్కొంది.
రెండు వార్మప్ మ్యాచ్‌ల్లోనూ ఓడిన పాకిస్థాన్ జట్టు.. 2023 ప్రపంచకప్‌ను విజయంతో ప్రారంభించింది. నెదర్లాండ్స్ జట్టు 12 సంవత్సరాల తర్వాత ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. అయినప్పటికీ పాకిస్తాన్ గెలవడానికి చెమటోడ్చవలసి వచ్చింది.
భారతదేశంలోని తమ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి పిల్లల లైంగిక వేధింపుల విషయాలను తొలగించాలని ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఎక్స్ గతంలో ట్విట్టర్, యూట్యూబ్, టెలిగ్రామ్‌లకు నోటీసులు జారీ చేసింది.
ప్రతిపక్ష ఇండియా కూటమిని నిజమైన సవాల్‌గా భావిస్తున్నానని కేంద్ర మంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం అన్నారు. తన సొంత రాష్ట్రం ఒడిశా నుంచి 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తనను అనుమతించాలని తన పార్టీని అభ్యర్థించినట్లు తెలిపారు.
అక్టోబర్ 13న జీ-20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు(P20 Summit)ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో కెనడా కూడా పాల్గొననుంది. నిజానికి భారత్- కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
ఢిల్లీలో ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించింది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులతో సీఈసీ భేటీ అయింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్‌తో పాటు మిజోరాం ఎన్నికల పరిశీలకులతో అనేక అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం చర్చించింది.
రెండేళ్లలో దేశం నుంచి వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం అన్నారు. లెఫ్ట్ వింగ్ తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలలో భద్రతా పరిస్థితిని సమీక్షించే సమావేశానికి అధ్యక్షత వహించిన అమిత్ షా.. 2022 సంవత్సరంలో గత నాలుగు దశాబ్దాలలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అతి తక్కువ హింస, మరణాలు సంభవించాయని చెప్పారు.
ఆసియా క్రీడల్లో పురుషుల హాకీ జట్టు సత్తా చాటింది. పురుషుల హాకీలో భారత్ మరోసారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్‌లో జపాన్‌పై విజయం సాధించి స్వర్ణం కైవసం చేసుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన తర్వాత, హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో సంచలన ప్రదర్శనతో హాకీ జట్టు భారత కీర్తి పతాకాన్ని ఎగరేసింది.