తెలంగాణ పాలనా వ్యవస్థపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. భారీగా పలు శాఖల ఉన్నతాధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు వేసింది. విధి నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా బదిలీ వేటు వేసినట్లు తెలిసింది.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ అఫ్గానిస్థాన్‌పై తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్‌లో విఫలమైన హిట్ మ్యాన్.. పసికూన అఫ్గాన్‌పై శతకంతో చెలరేగిపోయాడు.
రేపు(గురువారం) కాకినాడ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయలుదేరనున్నారు. పది గంటలకు పెద్దాపురం చేరుకోనున్నారు. పది నిమిషాల పాటు స్థానిక నేతలు, కార్యకర్తలతో ఇంటరాక్షన్ కానున్నారు.
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో యువతి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. మాదాపూర్‌లోని గోల్డెన్ హైవ్ ఓయో లాడ్జిలో ప్రియ ( 25) అనే యువతి అనుమానాస్పద స్థితి మృతి చెందింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
వ్యవసాయం, అనుబంధ రంగాలతో పాటు పౌరసరఫరాలశాఖలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పంటల సాగు, తాజా పరిస్థితులను సీఎంకు అధికారులు వివరించారు. జూన్ నుంచి సెప్టెంబరు వరకూ దాదాపుగా సాధారణ వర్షపాతం నమోదైందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు రెండు మ్యాచ్ ఆడుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా అఫ్గానిస్థాన్‌తో టీమిండియా తలపడుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ జట్టు మంచి స్కోరు సాధించింది.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శ నారా లోకేశ్ రెండో రోజు సీఐడీ విచారణ ముగిసింది. ఐఆర్ఆర్ కేసుకు సంబంధించి పలు అంశాలపై సీఐడీ ప్రశ్నలు వేసినట్లు సమాచారం. హెరిటేజ్ ఫుడ్స్ భూముల కొనుగోలు, జీఓఎమ్ నిర్ణయం, లోకేష్ పాత్రపై సీఐడీ ప్రశ్నలు వేసింది.
పురంధేశ్వరిపై సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్లకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. బీజేపీ జోలికి వస్తే సహించమని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ హెచ్చరించారు. పురంధేశ్వరిపై విమర్శలు చేసే స్థాయి సజ్జలకు లేదని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
రెండు పర్యాయాలు రాష్ట్ర ప్రజల్ని కేసీఆర్ మోసం చేసి ఓట్లను కొల్లగొట్టారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. ఖమ్మం జిల్లా అనాసాగరం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. మేనిఫెస్టో పేరుతో మరోసారి భ్రమలు కల్పించేందుకు బీఆర్‌ఎస్ కుట్ర చేస్తోందన్నారు.