కొన్ని రాజకీయ పార్టీలకు ఇష్టారాజ్యంగా మాట్లాడటం అలవాటుగా మారిందని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరమన్నారు. ప్రజల కోసమో, రాజకీయం కోసమో ఆలోచించుకుని మాట్లాడాలని మంత్రి సూచించారు.
లోకేశ్ సన్నిహితుడు, టీడీపీ నేత గుణ్ణం చంద్రమౌళి ఇంట్లో ఐటీ సోదాలు చేపట్టింది. నారా లోకేశ్‌కు ప్రధాన అనుచరుడిగా ఉన్న గుణ్ణం చంద్రమౌళి ఇంట్లో మూడు బృందాలుగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
శ్రీనిధి యూనివర్శిటీ తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ రెండవ ఎడిషన్‌లో తమ ఆధిపత్యం నిలబెట్టుకుంటూ MYK స్ట్రైకర్స్ బుధవారం ఎనిమిది పాయింట్లతో విజయాన్ని సాధించింది.
ప్రపంచ కప్ 2023లో బుధవారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లపై భారత బ్యాట్స్‌మెన్ పూర్తిగా ఆధిపత్యం చెలాయించారు, క్రికెట్ అభిమానులు కూడా హృదయాన్ని హత్తుకునే దృశ్యాన్ని చూశారు. ఫిరోజ్ షా కోట్లా స్టేడియం (ప్రస్తుతం అరుణ్ జైట్లీ స్టేడియం)లో జరిగిన మ్యాచ్‌లో భారత స్టార్ విరాట్ కోహ్లీ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ నవీన్-ఉల్-హక్‌ను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు.
హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చి ఉచిత వసతి పొందుతున్న ఉద్యోగుల వివరాలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. విభాగాల వారీగా ఫ్రీ అకామిడేషన్ పొందుతున్న వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది.
వరల్డ్ కప్ 2023 టోర్నీలో భారత్ విజయాల బాటలో పయనిస్తోంది. ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్‌లో చెమటోడ్చి గెలిచిన భారత్.. పసికూన అఫ్గానిస్థాన్ జట్టుపై అలవోకగా విజయం సాధించింది. హిట్ మ్యాన్ రోహిత్ భారీ శతకాన్ని నమోదు చేయడంతో 15 ఓవర్లు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని భారత్ తన ఖాతాలో వేసుకుంది.