PM Modi: తెలంగాణలో అధికారంలోకి రాగానే బీసీని సీఎం చేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ ప్రచారం స్పీడును పెంచింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మ గౌరవ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. సమ్మక్క, సారలమ్మ, యాదాద్రీశుడిని నమస్కరిస్తూ మోడీ ప్రసంగాన్ని ప్రారంభించారు. బీసీ ఆత్మగౌరవ సభలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇదే గ్రౌండ్‌లో ప్రజలు ఆశీర్వదించడంతో ప్రధాని అయ్యానన్నారు పీఎం మోడీ. ఇదే మైదానం సాక్షిగా బీజేపీ బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నారన్నారు. ఎల్బీ స్టేడియంతో తనకు గొప్ప అనుబంధం ఉందన్నారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే బీసీని సీఎం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నాటి సభలో తన ప్రసంగం కోసం టికెట్ పెట్టారని.. భారత చరిత్రలో అది ఒక కొత్త ప్రయోగమన్నారు.
Also Read: Pawan Kalyan: ప్రతి భారతీయుడి గుండెలో ధైర్యం నింపిన నేత మోడీ
Also Read
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
9 ఏళ్లుగా తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక ప్రభుత్వం ఉందని ప్రధాని మండిపడ్డారు. నీళ్లు, నిధులు నియామకాల కోసం తెలంగాణ ఉద్యమించిందని.. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీల ఆకాంక్షలను ఇక్కడి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్.. బీఆర్‌ఎస్ సీ టీమ్ అని.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ డీఎన్‌ఏలో 3 అంశాలు కామన్‌గా ఉన్నాయన్నారు. అవినీతి, కుటుంబపాలన, బుజ్జగింపు రాజకీయాలు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ లక్షణాలు అంటూ ప్రధాని మోడీ విమర్శించారు. తెలంగాణలో నిజమైన అభివృద్ధి కనిపించడం లేదన్న ప్రధాని మోడీ.. నీళ్లు, నిధులు, నియామకాలు మరిచిపోయారన్నారు. తెలంగాణలో మార్పు తుఫాన్ కనిపిస్తోందన్నారు ప్రధాని. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా చేసింది బీజేపీనేనని.. లోక్ సభ తొలి దళిత స్పీకర్‌గా బాలయోగిని చేసింది బీజేపీనే అంటూ ఆయన తెలిపారు. బీజేపీకి పూర్తి మెజార్టీ ఇచ్చి ఓబీసీకి చెందిన తనను ప్రధానిని చేశారని వెల్లడించారు. కేంద్ర కేబినెట్‌లో అత్యధిక మంది బీసీలు మంత్రులుగా ఉన్నారన్నారు. ఓబీసీలకు ఎంపీలుగా ఎక్కువ అవకాశాలు ఇచ్చింది బీజేపీనే అంటూ వ్యాఖ్యానించారు. బీసీ యువతకు బీఆర్‌ఎస్ ఏమి చేయలేదన్నారు. బీసీలకు రూ.లక్ష ఇస్తామని బీఆర్‌ఎస్ వాగ్దానం చేసిందని.. కానీ ఆ వాగ్దానాన్ని బీఆర్‌ఎస్ నెరవేర్చలేదన్నారు. మెడికల్, డెంటల్ సీట్లలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఇచ్చామన్నారు ప్రధాని మోడీ.
Also Read: Revanth Reddy: ధరణి కంటే మెరుగైన వ్యవస్థను తీసుకొస్తాం..
బీఆర్‌ఎస్ నేతల్లో అహంకారం కనిపిస్తోందని ప్రధాని అన్నారు. అవినీతి సర్కారును ఇంటికి పంపడం ఖాయమన్నారు. ఢంకా భజాయించి చెబుతున్నా.. బీఆర్‌ఎస్ ఓటమి ఖాయమని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. బీఆర్‌ఎస్ నేతలకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో సంబంధాలు ఉన్నాయని.. లిక్కర్ స్కామ్‌పై దర్యాప్తు చేస్తుంటే ఈడీ, సీబీఐని ఇక్కడి ప్రజలు తిడుతున్నారని ప్రధాని పేర్కొన్నారు. ఎవరూ ప్రజాధనాన్ని దోచుకున్నారో.. వాటిని తిరిగి రాబడతామన్నారు. అవినీతిని అంతం చేస్తామన్న ప్రధాని.. ఇది మోడీ గ్యారంటీ అన్నారు. అవినీతి చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదన్నారు. బీఆర్‌ఎస్ వైఫల్యం టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ అయిందని ప్రధాని విమర్శించారు. అన్ని నియామకాల పరీక్షల్లో అవకతవకలు కామన్ అయిపోయాయన్నారు. తెలంగాణ యువతను మోసం చేసిన బీఆర్‌ఎస్ ప్రభుత్వా్న్ని సాగనంపాలా, వద్దా అంటూ ప్రశ్నించారు. ఒక తరం భవిష్యత్‌ను బీఆర్‌ఎస్ నాశనం చేసిందన్నారు. తెలంగాణలో వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రధాని చెప్పారు. పేదలకు ఐదేళ్ల పాటు ఉచితంగా రేషన్ అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ఉచిత రేషన్.. ఇది మోడీ ఇస్తున్న గ్యారంటీ అని పేర్కొన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!