హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంత్రి హరీశ్ రావు సమక్షంలో ఓదెల జడ్పీటీసీ రాములు యాదవ్ బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రి హరీశ్ బీఆర్‌ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడారు. ఉచిత కరెంట్‌ను ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్ కాదా అంటూ ఆయన ప్రశ్నించారు.
నంద్యాల జిల్లా నూనెపల్లె వద్ద రైలు కిందపడి బాల నరసింహులు అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాల నరసింహులు స్వగ్రామం గోస్పాడు మండలంలోని చింతకుంట గ్రామం. ఏడాది క్రితం ఓ యువతీని వేధించాడని బాల నరసింహులుపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది.
తెలంగాణలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఏ పార్టీ నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారో లెక్క తేలింది. మూడు పార్టీలు కూడా బడుగుల ప్రతినిధి తామేనని చెప్పుకునే ప్రయత్నం చేశాయి. ఇంతకీ ఏ పార్టీ ఏ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లిందో తెలుసా?. ఎన్నికల్లో గెలవాలంటే ఏ ఒక్క వర్గమో ఓటేస్తే సరిపోదు. అందరి మద్దతు కావాల్సిందే. అందుకే అన్ని పార్టీలు కులాలను, వర్గాలను అక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
వేములవాడ రాజకీయాలు వేడెక్కాయి. వేములవాడలో బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన తులా ఉమకు టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకపోవడంతో అక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది. వేములవాడ బరి నుంచి వికాస్ రావు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో తుల ఉమ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
దీపావళి/ఛత్ పూజా సీజన్‌లో, రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం మరియు ప్రయాణీకుల అదనపు రద్దీని అధిగమించడానికి దక్షిణ మధ్య రైల్వే సాధారణ, రోజువారీ ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లతో పాటు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. రైలు ప్రయాణీకుల ప్రయోజనం కోసం జోన్‌లోనే కాకుండా జోన్ వెలుపలి గమ్యస్థానాలకు కూడా ప్రత్యేక రైళ్లు నడపబడుతున్నాయి.
మాదిగలను పశువుల కన్నా హీనంగా చూసింది ఈ సమాజమంటూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వాపోయారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన మాదిగ విశ్వరూప మహాసభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు మాటలు చెపుతున్నాయని.. మోడీ మాత్రమే సామాజిక న్యాయం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
మాదిగల విశ్వరూప మహా సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ వేస్తామని ప్రకటించారు. దీనిపై న్యాయపరమైన ప్రక్రియ సుప్రీంకోర్టులో ఉందన్నారు. మాదిగల ఉద్యమాన్ని తాము గుర్తించామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అంబేడ్కర్ స్వప్నాన్ని తాము నెరవేరుస్తామన్నారు.
ఎన్డీయే ప్రభుత్వ తొలి లక్ష్యమే పేదరిక నిర్మూలన అని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. గుర్రం జాషువా తన కష్టాల్ని కాశీ విశ్వేశరుడికి విన్నవించుకున్నారని ఆయన చెప్పారు. బీజేపీ మాత్రమే అణగారిన వర్గాలకు అండగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. కాశీ విశ్వనాథుడి దీవెనలతోనే నేను ప్రధానిగా మీ ముందు ఉన్నానన్న ప్రధాని మోడీ.. పండుగ సమయంలో మనకు కావాల్సిన వాళ్ల మధ్య ఉంటే.. ఆనందం రెట్టింపు అవుతుందన్నారు.