మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో శనివారం దీపావళి బోనస్ ఇవ్వడానికి నిరాకరించినందుకు దాబా యజమానిని అందులో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు కొట్టి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దీపావళి బోనస్‌ను ఇవ్వడానికి యజమాని తిరస్కరించడంతో శనివారం తెల్లవారుజామున నాగ్‌పూర్ గ్రామీణ ప్రాంతంలోని కుహి ఫాటా సమీపంలోని ధాబా వద్ద అతని ఉద్యోగులు గొంతు కోసి, కత్తితో పొడిచి, కొట్టి చంపినట్లు పోలీసులు వెల్లడించారు.
దీపావళి పండుగ వేళ కోనసీమలో అపశృతి చోటుచేసుకుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం ఆవిడి కట్లమ్మ అమ్మవారి ఆలయం వద్ద పూరింటిపై తారాజువ్వ పడి అగ్ని ప్రమాదం సంభవించింది.
తాను గజ్వేల్ వస్తున్నా అని తెలవగానే కేసీఆర్ కామారెడ్డి పోయారని గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక (మం) దుద్దెడలో ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. తన భార్య అన్నీ అమ్ముకుందాం, అవసరం అయితే మళ్ళీ కొంగు నడుంకి కట్టి పనిచేస్తా.. నువ్వు మాత్రం కేసీఆర్ మీద కొట్లాట ఆపవద్దు అని చెప్పిందని ఈటల తెలిపారు.
ఇవాళ సాయంత్రం 7 గంటల నుంచి ఇంద్రకీలాద్రి ఆలయం మూసివేయనున్నారు. ఈరోజు దీపావళి సందర్భంగా అమ్మవారి ప్రధానాలయము నందు సాయంత్రం 5 గంటలకు ధనలక్శ్మి పూజను నిర్వహించారు. సాయంత్రం 06 గంటలకు అమ్మవారికి పంచహారతులు సేవను నిర్వహించారు.
విశాఖపట్నం జిల్లా మధురవాడ కొమ్మాది ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. మద్యం దుకాణంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తనకు నచ్చిన బ్రాండ్ ఇవ్వలేదని మనస్థాపంతో ఈ విధంగా వీరంగం సృష్టించినట్లు తెలిసింది.