Vandalism at School: శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టాఫ్ రూం తాళం పగలగొట్టి కొందరు దుండగులు పాఠశాల రికార్డులను తగలబెట్టారు. గదిలో రికార్డులు, పరీక్ష పత్రాలు కాలి బూడిదయ్యాయి. అర్ధరాత్రి సమయంలో దుండగులు పాఠశాలలోకి చొరబడి పాఠశాల రికార్డులను ధ్వంసం చేశారు. గతంలోనూ పాఠశాల రికార్డులు మాయం కాగా.. మళ్లీ అదే తరహాలో ఘటన చోటు చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుడు తాళాలు పగలగొట్టిన విషయంతో పాటు గది నుంచి పొగ వస్తుండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించగా విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Read Also: Teacher Kidnap Incident: మలుపులు తిరుగుతున్న టీచర్ కిడ్నాప్ వ్యవహారం