Janasena: 2024 ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తం అవుతోంది. ఎన్నికల కార్యక్రమాలు, సభలు సజావుగా సాగేందుకు జనసేన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. జోనల్ వారీగా ఎన్నికల కమిటీలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియమించారు. ఉత్తరాంధ్ర, సెంట్రల్ ఆంధ్ర, గోదావరి, రాయలసీమ 1, రాయలసీమ 2 జోన్లుగా ఈ కమిటీలను నియమించారు. ఈ కమిటీలకు కన్వీనర్లు, కో కన్వీనర్లు, సభ్యులను నియమిస్తూ శనివారం నిర్ణయం తీసుకున్నారు. ఇందులో లీగల్, డాక్టర్ సెల్స్ తరఫున సభ్యులు ఉంటారు. ఎన్నికల కార్యక్రమాల నిర్వహణకు జోనల్ కమిటీలు కీలక పాత్ర పోషించనున్నాయి. రేపు జోనల్ కమిటీలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. పవన్ పాల్గొనే కార్యక్రమాలు, సభల నిర్వహణ సజావుగా సాగేందుకు ప్రత్యేకంగా కమిటీల ఏర్పాటు చేశారు.