Koti Deepotsavam 2024 Day 4: ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ‘కోటి దీపోత్సవం’ దిగ్విజయంగా కొనసాగుతోంది. దీపాల పండగలో ఇప్పటికే మూడు రోజులు పూర్తి కాగా.. వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. నేడు కోటి దీపోత్సవంలో నాలగవ రోజు. అందులోనూ కార్తిక సోమవారం కాబట్టి.. భక్తులు తండోపతండాలుగా తరలిరానున్నారు. మంగళవారం నాడు కోటి దీపోత్సవంలో విశేష కార్యక్రమాలు ఏంటో తెలుసుకుందాం.
నాల్గవ రోజు విశేష కార్యక్రమాలు ఇవే..
*శ్రీ నిత్యానంద మహామండలేశ్వర్ స్వామీ, శ్రీ సర్వవిదానంద సరస్వతి స్వామీజీ అనుగ్రహభాషణం చేయనున్నారు.
*డా.మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి ప్రవచనామృతం వినిపించనున్నారు.
*వేదికపై కంచి కామాక్షికి, శృంగేరి శారదాంబికకు కోటి పసుపుకొమ్ముల సుమంగళీపూజ నిర్వహించనున్నారు.
*నేడు అలంపురం జోగులాంబ కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు.
*నేడు గజవాహనంపై ఆది దంపతులు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.