మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజుపై అభిశంసన తీర్మానం తీసుకొచ్చేందుకు మాల్దీవుల ప్రతిపక్షం సిద్ధమైంది. మొహమ్మద్ ముయిజ్జూ ప్రభుత్వంపై మాల్దీవుల్లోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ అభిశంసన ప్రక్రియను ప్రారంభించేందుకు అవిశ్వాస తీర్మానాన్ని ప్రారంభించడానికి అవసరమైనంత సంతకాలను సేకరించింది.
ఉద్యోగం, ఆదాయం లేనందున తన భార్యకు భరణం చెల్లించలేనని భర్త చెప్పడం తగదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగం లేకపోయినా కూలి పనిచేసైనా విడాకులు తీసుకున్న భార్యకు భరణం చెల్లించాల్సిందేనని న్యాయస్థానం తీర్పునిచ్చింది. కూలి పనులు చేసైనా రోజుకు రూ.300 లేదా రూ.400 సంపాదించైనా భరణం చెల్లించాలని భర్తను కోర్టు ఆదేశించింది.
దేశంలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 15 రాష్ట్రాల్లోని 56 స్థానాలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. 56 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనుండగా.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య పోలింగ్ జరగనుంది.
రాష్ట్రంలో మహిళల ఆర్థికాభివృద్ధే సీఎం జగన్ లక్ష్యమని మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి తెలిపారు. శనివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలోని గడియార స్తంభం సెంటరులోని వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి అనంతరం డ్వాక్రా బజారులో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను సకాలంలో అందించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు.
బీహార్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాకూటమి సర్కార్ పడిపోయింది. గత వారం రోజులుగా చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభానికి ముగింపు పలుకుతూ ముఖ్యమంత్రి పదవికి ఆదివారం ఉదయం నితీష్ రాజీనామా చేశారు.
చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. తనపై చంద్రబాబు మితిమీరి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. "నన్ను పాపాల పెద్దిరెడ్డి అంటావా ?. నీ లాగా మామకు వెన్నుపోటు పొడిచానా ?. చంద్రబాబు నువ్వు అధికారంలోకి రావు. కనీసం కుప్పంలో కూడా గెలవలేవు. కుప్పంకు మేము నీరు ఇస్తున్నాం... 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఏమి చేశావ్. రాజకీయంగా చూసుకోలేక చౌకబారు విమర్శలకు దిగారు. ఓటమి భయంతో చంద్రబాబు మాటలు మాట్లాడుతున్నారు." అని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలను ప్రధాని మోడీ ప్రారంభించారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం 75వ వసంతంలోకి అడుగు పెట్టింది. 1950 జనవరి 28న సుప్రీంకోర్టు ప్రారంభమైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యాయస్థాన వజ్రోత్సవాలను ప్రారంభించారు.
ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిది సార్లు బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్‌కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. తాజాగా మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ముచ్చటగా తొమ్మిదోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
రాష్ట్రంలో అన్ని వర్గాలు కోపంతో, ఉక్రోషంతో వున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని వంద అడుగుల లోతులో పాతి పెట్టేయడం ఖాయమని ఆయన అన్నారు. శ్రీలంకలో రాజపక్సే ప్రభుత్వాన్ని తరిమి కొట్టినట్టే ఏపీలో జగన్మోహన్ రెడ్డి పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడానికి జనం సిద్ధంగా ఉన్నారన్నారు.