దివంగత మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు కేంద్రప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించిన తర్వాత బీహార్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. అనంతరం రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్‌హోం కార్యక్రమంలో బీజేపీ నేతలతో నితీష్‌కుమార్ చెట్టాపట్టాల్ వేసుకుని తిరగడం.. వారితో కలిసి నవ్వులు చిందించడంతో అప్పుడే సంకీర్ణ ప్రభుత్వానికి బీటలు వారుతున్నాయని సంకేతాలు వెళ్లాయి.
చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి మోసం చేసేందుకే చంద్రబాబు సభలు పెడుతున్నారని.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రాయలసీమలో కరవు కాటకాలు ఏర్పడ్డాయని ఆయన విమర్శించారు.
తన రాజకీయ విరామంపై ఎంపీ గల్లా జయదేవ్ క్లారిటీ ఇచ్చారు. గుంటూరులో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సభ నిర్వహించారు ఎంపీ గల్లా జయదేవ్. తనకు రాజకీయంగా అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ఎంపీగా రెండు సార్లు గెలిపించిన గుంటూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
బీహార్ రాజకీయ సంక్షోభం చివరంఖానికి చేరుకుంది. అంతా ఊహించినట్టుగానే మహాకూటమికి నితీష్‌కుమార్ గుడ్‌బై చెప్పేశారు. కొద్దిసేపటి క్రితం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
దేశ సర్వోన్నత న్యాయస్థానం 75వ వసంతంలోకి అడుగు పెట్టింది. 1950 జనవరి 28న సుప్రీంకోర్టు ప్రారంభమైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యాయస్థాన వజ్రోత్సవాలను ప్రారంభించనున్నారు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్వహించిన జూనియర్ సివిల్ జడ్జి పరీక్షల్లో తెలంగాణ యువతి సత్తా చాటింది. పరీక్ష ఫలితాల్లో తెలంగాణ యువతి అలేఖ్య(24) ఫస్ట్ ర్యాంకు సాధించి సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. హనుమకొండకు చెందిన మాధవీలత, పరిమి మనోజ్ కుమార్ దంపతుల కుమార్తె అలేఖ్య హైదరాబాద్ పెండేకంటి కాలేజీలో 2022లో న్యాయశాస్త్ర విభాగంలో ఉత్తీర్ణత సాధించారు.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దేవినేనివారి గూడెంలో పెద్దపులి సంచారం హడాలెత్తిస్తోంది. అర్ధరాత్రి సమయంలో గ్రామంలోని రెండు ఆవులు, ఒక దూడపై పులి దాడి చేసింది. తెల్లవారుజామున పొలంలోకి వెళ్లిన రైతులు గాయపడిన ఆవులను చూసి పులి దాడి జరిగినట్టుగా గుర్తించారు.
అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో భార్య మృతదేహాన్ని బంధువుల సాయంతో 20 కిలోమీటర్లు భుజాలపై మోసుకెళ్లిన దయనీయ ఘటన ఒడిశాలోని నవరంగపూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
రేపు టీటీడీ పాలకమండలి సమావేశం కానుంది. 2024-25 వార్షిక బడ్జెట్‌కు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలుపనుంది. 5 వేల కోట్ల అంచనాతో వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.