ఒంగోలులో పేదలకు ఇళ్లస్దలాలు ఇవ్వకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పానని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. పేదల స్థలాల కోసం 231 కోట్ల రూపాయలు విడుదల చేసిన సీఎం జగన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను దాదాపు మూడేళ్ల తర్వాత ఆమోదించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా రాజీనామా చేయగా.. ఇప్పటి వరకు పెండింగ్‌లో పెట్టిన స్పీకర్.. ఇప్పుడు ఆమోద ముద్ర వేయడంపై గంటా శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు.
దొంగ ఓట్లతో గెలవాలని జగన్ కుట్రలు చేస్తున్నారని.. ఓటర్ల జాబితాలో అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి తెలిపారు. బీజేపీ సోషల్ మీడియా విభాగంతో బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై పురంధేశ్వరి దిశా నిర్దేశం చేశారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడంపై ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు బెయిల్‌ను సుప్రీంలో ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది.
భారతీయ సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న అసమానతల గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు విద్య, ఆరోగ్యం, పోషకాహారం, సమాన అవకాశాల కోసం మాత్రమే కాకుండా బాలికల హక్కుల గురించి అవగాహనను పెంపొందించడం, బాల్య వివాహాలు, వివక్ష, బాలికలపై హింస వంటి సమస్యలను పరిష్కరిస్తుంది.
తమిళనాడులోని మధురై జిల్ల అలంగనల్లూరు సమీపంలోని కీలకరైలో నూతనంగా నిర్మించిన జల్లికట్టు స్టేడియాన్ని సీఎం స్టాలిన్ ప్రారంభించారు. జల్లికట్టు కోసం దేశ చరిత్రలో తొలిసారిగా ప్రత్యేకంగా ప్రభుత్వం నిర్మించిన స్టేడియం ఇదే కావడం గమనార్హం.
ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం చినకామన పూడి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గన్ పౌడర్ పేలి ఓ కూలీ మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గన్ పౌడర్ (తుపాకీ మందు) పేలి చేపల చెరువుల వద్ద పని చేసే కూలీలిద్దరు తీవ్రంగా గాయపడగా... వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.