తిరుమలలో శ్రీవెంకటేశ్వర ధార్మిక సదస్సు ముగిసింది. మూడు రోజుల పాటు సాగిన సదస్సులో 62 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు సూచనలు, సలహాలు ఇచ్చారు. మూడు రోజులు పాటు జరిగిన ధార్మిక సదస్సులో అనేక తీర్మానాలు చేశామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి గవర్నర్ ప్రసంగించారు. విజయవాడలో బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించామని.. సాంఘిక న్యాయం, సమానత్వం కోసం మా ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ తెలిపారు.
ఇచ్చిన హామీలు అమలు చేయదని టీడీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో ఇచ్చిన హామీలను అమలు చేసిన ఏకైక సీఎం జగన్ అని ఆయన తెలిపారు. చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు మేనిఫెస్టో లో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు.
ప్రేమ పేరుతో నమ్మించి.. శారీరకంగా అనుభవించి పెళ్లికి నిరాకరించడమే కాకుండా స్లో పాయిజన్ ద్వారా చంపాలని చూశాడు ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కి చెందిన మాధురి, శేఖర్‌లు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఒకేరోజు రెండుసార్లు భేటీకావడం, సుదీర్ఘంగా చర్చలు జరపడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీట్ల సర్దుబాటుపై ఫైనల్ చర్చల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం దాదాపు మూడు గంటలపాటు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పవన్ సమావేశమయ్యారు.
ఎమ్మార్వో రమణయ్య హత్య కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు మమ్మరం చేశారు. చెన్నైలో నిందితుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉదయం 10 గంటలకు గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఉభయసభలూ మంగళవారానికి వాయిదా పడతాయి. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ సమావేశం జరుగుతుంది.
టైటిలింగ్ యాక్ట్ చట్టం ఇంకా అమలు చేయలేదని.. ఈ చట్టంపై అడ్వకేట్స్ కొన్ని అభ్యంతరాలు చెబుతున్నారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. రాష్ట్రంలో త్వరితగతిన రీ సర్వే పూర్తి అవుతుందని ఆయన ప్రకటించారు. ఇంకా రూల్స్ తయారు చేయలేదు , అసెంబ్లీ చర్చించలేదని.. న్యాయవాదుల సలహాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.