ఇవాళ మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటలకు సమావేశం కానున్న ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుంది. వివిధ శాఖల చెందిన యాన్యువల్ నివేదికలను సభ ముందు ప్రభుత్వం పెట్టనుంది. ఏపీలో మరో 2 నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది.
అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. జిల్లా సరిహద్దుల్లో తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్‌ను వాహనంతో ఢీకొట్టి చంపారు. కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో ఉన్న కారుతో ఢీకొట్టడంతో ఒక కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు సోమవారం రాత్రి తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఏపీలో పవన్ కళ్యాణ్‌తో బీజేపీకి పొత్తు ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మరోసారి స్పష్టం చేశారు. పొత్తులపై నిర్ణయం అధిష్ఠానానిదే అని ఆమె చెప్పారు.జనసేనతో బంధుత్వం లేదు అని అధిష్టానం చెపితే లేనట్టేనని.. పవన్‌తో బంధుత్వంపై అధిష్టానం చెపితే మీకూ చెపుతామని మీడియా ముందు పురంధేశ్వరి తెలిపారు.
ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ విద్యా శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అసెంబ్లీలోని బొత్స సత్యనారాయణ ఛాంబర్‌లో కీలక సమీక్ష చేపట్టారు. ఈ కీలక సమావేశానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.
ప్రతీ ఒక్కరి జీవితంలో ఒకేసారి వచ్చే అపూరమైన వేడుక పెళ్లి. ఈ పెళ్లిని కలకాలం గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకుంటారు ప్రతీ ఒక్కరు. అలాంటి మధుర జ్నాపకాల కోసం లక్షలు ఖర్చు పెడుతుంటారు. పెళ్లి కుదిరినప్పటి నుంచి ప్రతీ ఈవెంట్‌ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఒక రోజు పాటు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. వాయిదా తీర్మానంపై చర్చించాలని టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ధరల పెరుగుదలపై చర్చించాలని సభలో టీడీపీ డిమాండ్ చేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌లపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని ఫైర్ అయ్యారు. జగన్ జనంలోకి వెళుతుంటే టీడీపీ, జనసేన షేక్ అవుతున్నాయని ఆయన అన్నారు. 2014లో ఉమ్మడి పోటీగా ఇచ్చిన హామీల్లో ఒకటైనా నెరవేర్చారా అంటూ ప్రశ్నించారు.
ఇవాళ సర్పంచుల ఛలో అసెంబ్లీ తరుణంలో నిన్నటి నుంచే సర్పంచులను హౌస్ అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. ఏపీ సర్పంచుల సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌ను నిన్ననే(సోమవారం) హౌస్ అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న సర్పంచులను అక్కడే హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. హై అలర్ట్ ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సర్పంచులు డిమాండ్ల పరిష్కారం కొరకు చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టారు.