జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకు మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. శ్రీనగర్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు ఇదే కేసులో గత నెలలో సమన్లు అందాయి.
రెండేళ్ళకు ఒకసారి జరిగే ఆసియాలోనే అతి పెద్దదైన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర 2024 సందర్భంగా డా. కేర్ హోమియోపతి యొక్క అన్ని తెలంగాణ బ్రాంచ్‌లలో ఉచితంగా యాంటీ-ఇన్ఫెక్షన్ పిల్స్ పంపిణీ రేపటి(మంగళవారం) నుంచి జరుగుతుంది.
ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు జరుపుకునే వాలెంటైన్స్ వీక్‌లో, ఫిబ్రవరి 12ని కిస్ డేగా జరుపుకుంటారు. ప్రేమను వ్యక్తీకరించడానికి ముద్దు ఉత్తమ మార్గం. దీని ద్వారా ఎదుటి వ్యక్తికి ఏమీ చెప్పకుండానే మీ ప్రేమను వ్యక్తపరచవచ్చు.
కర్ణాటకలోని కొప్పల్‌లో దారుణ ఘటన చేసుకుంది. భర్త కళ్లేదుటే ఆరుగురు వ్యక్తులు 21 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె భర్తను విచక్షణారహితం కొట్టారని బాధితురాలు తెలిపింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మనీష్ సిసోడియాకు స్వల్ప ఊరట లభించింది. తన మేనకోడలు వివాహానికి హాజరయ్యేందుకు ఢిల్లీ కోర్టు సోమవారం మనీష్ సిసోడియాకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఇంటి కూల్చివేత కేసులో మున్సిపల్ కార్పొరేషన్‌కు ఇండోర్ హైకోర్టు చురకలంటించింది. ఎవరి ఇంటినైనా కూల్చడం ఫ్యాషన్‌గా మారిందని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. దోషులకు కోర్టు జరిమానా కూడా విధించింది.
బీహార్‌లో జేడీయూ బీజేపీ మద్దతుతో సర్కారును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నితీష్ సర్కారు నేడు బలపరీక్షను ప్రవేశపెట్టింది. బలపరీక్షకు ముందు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నితీష్ కుమార్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను అస్సాం ప్రభుత్వం సోమవారం 2.9 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌ను సమర్పించింది. 774.47 కోట్ల లోటును బడ్జెట్ అంచనా వేసింది. ఇందులో కొత్త పన్ను ఏదీ ప్రతిపాదించలేదు.
ఒక మహిళ తన ఇష్టానుసారం విడివిడిగా జీవిస్తుంటే భర్త నుంచి భరణం పొందే హక్కు ఆమెకు లేదని మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌లోని ఫ్యామిలీ కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు భర్త నుంచి విడివిడిగా ఉంటున్న మహిళ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. భర్త నుంచి విడిగా జీవించాలని మహిళ నిర్ణయించుకున్నందున ఆమెకు భరణం అడిగే హక్కు లేదని కోర్టు పేర్కొంది.
మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. లోక్‌సభ ఎన్నికలకు నెలరోజుల ముందు ప్రతిపక్ష కూటమి ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పార్టీకి రాజీనామా చేశారు.