బీజేపీతో కలిసి ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వంపై విశ్వాసం కోరుతూ బీహార్ సీఎం నితీష్ కుమార్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అసెంబ్లీ స్పీకర్ అవధ్ బిహారీ చౌధరీపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిన తర్వాత నితీష్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
వైసీపీ అధినేత, సీఎం జగన్ ఆదేశాల మేరకు వివిధ రీజనల్ కో-ఆర్డినేటర్లకు పార్లమెంట్ నియోజకవర్గాలు, జిల్లాల బాధ్యతలను వైసీపీ అధిష్ఠానం అప్పగించింది. ఒంగోలు పార్లమెంట్, ఉమ్మడి నెల్లూరు జిల్లాల కోఆర్డినేటర్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించగా.. విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా మల్లాది విష్ణును నియమించారు.
అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాటిపర్తి పంచాయితీ కాశీపురం గ్రామంలో తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో భార్య ఓ మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉభయగోదావరి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకూ పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన కోసం జనసేన నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిరోజు భీమవరంలో వివిధ సమావేశాల్లో పవన్ పాల్గొననున్నారు.
ఏపీలో రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో పొత్తులపై కీలక చర్చ జరుగుతోంది. తాజాగా ఏపీలో పొత్తుల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. ఒకట్రెండు రోజుల్లో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
టిడ్కో ఇళ్లను వెంటనే పేదలకి ఇవ్వాలని జనసేన నేత జానీ మాస్టర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలో జనసేన నేత జానీ మాస్టర్ ఆధ్వర్యంలో కె.వి.ఆర్ సర్కిల్ నుంచి వెంకటేశ్వరపురంలోని టిడ్కో ఇళ్ల వరకూ ర్యాలీ నిర్వహించారు.
ఏపీలో సంచలనంగా మారిన ఎమ్మార్వో రమణయ్య మర్డర్ కేసులో నిందితుడిని 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. కస్టడీలో భాగంగా పోలీసులు రెండో రోజు పీఎం పాలెం పోలీస్ స్టేషన్‌లో నిందితుడిని విచారిస్తున్నారు. ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో నిందితుడు గంగారాం కాల్ డేటా కీలకంగా మారింది.
బడ్జెట్ అన్ని వర్గాల వారిని నిరాశ పరిచిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. వాగ్దాన భంగంకు బడ్జెట్ అద్దం పడుతుందన్నారు. కొండంత ఆశలు చూపి గోరంత కూడా బడ్జెట్ ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై హరీశ్‌రావు మాట్లాడారు.