Dr.CARE: రెండేళ్ళకు ఒకసారి జరిగే ఆసియాలోనే అతి పెద్దదైన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర 2024 సందర్భంగా డా. కేర్ హోమియోపతి యొక్క అన్ని తెలంగాణ బ్రాంచ్‌లలో ఉచితంగా యాంటీ-ఇన్ఫెక్షన్ పిల్స్ పంపిణీ రేపటి(మంగళవారం) నుంచి జరుగుతుంది.
ఈ యాంటీ-ఇన్ఫెక్షన్ పిల్స్ వాడటం వల్ల జటుబు, దగ్గు, జ్వరం, చర్మ సమస్యలు, యూరిన్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు రాకుండా నివారించి, ఇమ్యూనిటీని పెంచుతాయి. తద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి. ఎలాంటి డైట్ ను పాటించాల్సిన అవసరం లేదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఈ యాంటీ-ఇన్ఫెక్షన్ పిల్స్ను చిన్నపిల్లల నుంచి పెద్ద వారి వరకు ఏ వయస్సు వారైనా కూడా వాడవచ్చు.
ఈ కార్యక్రమంలో డా॥ కేర్ CMD డా.A.M. రెడ్డి మాట్లాడుతూ.. “మన తెలంగాణ సంస్కృతి ఎంతో గొప్పది మరియు పురాతనమైనది. తెలంగాణలోనే అతిపెద్ద జాతర అయినటువంటి సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా డా. కేర్ తరపున ఏదైనా చేయాలి అన్న అలోచన వచ్చినపుడు క్రిందటి సంవత్సరం జాతర సమయంలో చాలా మంది ఇన్ఫెక్షన్ల భారీన పడటం గమనించామని, అందుకే ఈ యాంటీ- ఇన్ఫెక్షన్ పిల్స్ ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. ఈ పిల్స్ వాడటం ద్వారా ఇన్ఫెక్షన్లు సోకకుండా ఆరోగ్యంగా ఉండవచ్చని, Prevention is better than cure అనే సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని ఈ యాంటీ-ఇన్ఫెక్షన్ పిల్స్ ఇమ్యూనిటీ బూస్టర్ అందచేస్తున్నామన్నారు.
ఈ మందులను 8 నుండి 10 రోజులు ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 4 పిల్స్కు వేసుకోవాలి. దీని వలన ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని, తెలంగాణలోని అన్ని డా. కేర్ హోమియోపతి బ్రాంచ్లో, ఆన్లైన్ ద్వారా మరియు 733 755 7853 నంబర్ కి ఫోన్ చేయడం ద్వారా ఉచితంగా కొరియర్ ద్వారా ఈ యాంటీ- ఇన్ఫెక్షన్ పిల్స్ పొందవచ్చని పేర్కొన్నారు.