CM YS Jagan: వాలంటీర్లే నా సైన్యం.. వారే కాబోయే లీడర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: ఒక్క రూపాయి లంచం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, వాలంటీర్లు రాబోయే రోజుల్లో లీడర్లు కాబోతున్నారని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 58 నెలలు అలసిపోకుండా పేదలకు సేవ చేశామన్నారు. మరో రెండు నెలలు పేదవారి బతుకులు మార్చేందుకు యుద్ధానికి సిద్ధమా అంటూ సీఎం పేర్కొన్నారు. లంచంలేని, వివక్ష లేని వ్యవస్థ తీసుకురావాలన్నదే వాలంటీర్ల వ్యవస్థ లక్ష్యమని సీఎం తెలిపారు. టీడీపీని అధికారంలో నుంచి దింపడానికి జన్మభూమి కమిటీలే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. గత టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలతో దోచుకున్నారంటూ ఆయన మండిపడ్డారు. జన్మభూమి కమిటీ, సచివాలయ వ్యవస్థ మధ్య చాలా తేడా ఉందని.. పేదలకు సేవ చేయడానికి మన వ్యవస్థలు పుట్టాయన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. మన వ్యవస్థల ద్వారా ప్రతీ గ్రామంలో స్కూళ్లు, ఆసుపత్రులు మారాయని సీఎం పేర్కొన్నారు.
Read Also: Tirupathi: తిరుపతి జూపార్క్‌లో వ్యక్తిని చంపిన సింహం
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
మీరు వాలంటీర్లు కాదు.. సేవా హృదయాలు అని వాలంటీర్లను ఉద్దేశించి ప్రశంసలు గుప్పింటారు. 2 లక్షల 60 వేల మంది వలంటీర్లు నా సైన్యమని ముఖ్యమంత్రి తెలిపారు. ఇంటింటి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య సురక్ష ప్రవేళపెట్టామన్నారు. గత ప్రభుత్వంలో ప్రతీ పథకానికి లంచం ఇవ్వాల్సిందేనని.. గతంలో ప్రతీ పనికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. రైతులు, అవ్వాతాతలకు, అక్కాచెల్లెమ్మలకు తోడుగా వాలంటీర్ల వ్యవస్థ ఉందన్నారు. ఆర్‌బీకే వ్యవస్థ రైతన్నకు కొండంత అండగా ఉందని.. వాలంటీర్లు సూర్యుడు ఉదయించక ముందే ఇంటి తలుపు తట్టి పెన్షన్ అందిస్తున్నారని సీఎం చెప్పారు. కులం, మతం, ప్రాంతం చూడకుండా అర్హతే ప్రామాణికంగా.. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. చంద్రబాబు పాలనలో 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ వచ్చేదని.. గడప గడపకు వెళ్లి పెన్షన్ ఇస్తున్న వ్యవస్థ ఎక్కడా లేదన్నారు.
సీఎం జగన్ మాట్లాడుతూ.. “గతంలో జన్మభూమి కమిటీల అరాచకాల వల్ల జనం నష్టపోయారు. చంద్రబాబు జన్మభూమి కమిటీలు గంజాయి మొక్క. చంద్రబాబు పాలన విషవృక్షం, మన పాలన కల్పవృక్షం. మన సచివాలయ వ్యవస్థ తులసి మొక్క. మన పథకాలకు వాలంటీర్లు బ్రాండ్ అంబాసిడర్లు. వివిధ విభాగాల్లో 2.55 లక్షల మంది వాలంటీర్లకు సత్కారం. సేవావజ్రాలకు రూ. 30 వేల నుంచి రూ. 45 వేలకు పెంపు. సేవారత్నలకు రూ. 20వేల నుంచి రూ.30 వేలకు పెంపు. సేవా మిత్రలకు రూ.10 వేల నుంచి రూ.15వేలకు పెంపు. 875 మందికి సేవావజ్ర, 4,150 మందికి సేవారత్న.. 2,50, 439 మందికి సేవామిత్ర అవార్డుల ప్రదానం చేస్తున్నాం. లంచాలు, వివక్ష వ్యవస్ధను వాలంటీర్ల బద్దలు కొట్టారు. మీ నిజాయితీని గుర్తిస్తూ నాలుగేళ్లుగా బహుమతులు ఇస్తున్నాం.” అని సీఎం జగన్ తెలిపారు.
Read Also: Hyderabad: తెలంగాణ బడ్జెట్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు
ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. చంద్రబాబు మేనిఫెస్టో హైదరాబాద్‌లో పుడితే.. ప్రజల కష్టాలను చూసి మన మేనిఫెస్టో పుట్టిందని ఆయన అన్నారు. వివక్షకు చోటు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ప్రజలను మోసం చేయడానికే చంద్రబాబు సాధ్యం కానీ హామీలు ఇస్తున్నారన్నారు. చంద్రబాబు వేరే రాష్ట్రాల్లోని హామీలను కిచిడీ చేసి మేనిఫెస్టో అంటాడని.. బాబు హామీలకు రూ. లక్షా 26 వేల 140 కోట్లు అవుతుందని.. ఎలాగో ఇచ్చేది లేదు కాబట్టి .. బాబు ఏదేదో చెప్తాడన్నారు. మన యువ సైన్యం రాబోయే రెండు నెలలు యుద్ధానికి సిద్ధం కావాలన్నారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. ” గతంలో చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మన ప్రభుత్వం చేసిన మంచిని ప్రతీ ఇంటికి వెళ్లి వివరించాలి. మన చొక్కా చేతులు మడత పెట్లాల్సిన సమయం వచ్చేసింది. మన పాలనలో లంచాలు, వివక్ష లేకుండా పథకాలు అందుతున్నాయి.చంద్రబాబు వస్తే.. చంద్రముఖీలు వస్తాయని ప్రతీ ఇంటికీ వెళ్లి చెప్పండి. 58 నెలల పాలనలో వ్యవస్థలో మార్పు వచ్చిందంటే వాలంటీర్లే కారణం.” అని సీఎం తెలిపారు. ఒక్క జగన్ ఒకవైపు.. మరో వైపు దుష్టచతుష్టయం ఉందన్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!