CMR: హైదరాబాద్ కూకట్ పల్లి ఖైతలాపూర్ గ్రౌండ్‌లో మెగాడ్రోన్ షో ఆదివారం జరిగింది. సీఎంఆర్ ఫ్యామిలీ, సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యూయలెరీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫ్యాషన్ షో, మెగా డ్రోన్ షో జరిగాయి. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ జరగని విధంగా 500 డ్రోన్లతో ఈ షో నిర్వహించారు. కనీవినీ ఎరుగని విధంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. సీఎంఆర్ కుటుంబసభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని.. మెగా డ్రోన్ షోను వీక్షిస్తూ సందడి చేశారు.