ఈ నెల 19 నుంచి 23 వరకు దుబాయిలోని దుబాయి ట్రేడ్ సెంటర్‌లో, 22వ గల్ఫ్ ఫుడ్ ఫెస్టివల్ జరిగింది. ఈ కార్యక్రమానికి 127 దేశాల నుంచి పలు ఆహార సంస్థల తయారీదారులు వీక్షకులుగా వచ్చారు. అక్కడ తెనాలి డబల్ హార్స్ సంస్థ తన స్టాల్‌ని ఏర్పాటు చేసింది.
టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విడుదల చేశారు. ఈ క్రమంలో సీట్ల ప్రకటన తర్వాత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్దం అని వైసీపీ జగన్ అంటున్నారని.. మేం యుద్దానికి సంసిద్ధం రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండటానికి మేం ఇది చేస్తున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు ప్రకటించారు. 24 ఎమ్మెల్యే స్థానాల్లో, మూడు ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని... మిగతా స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని చంద్రబాబు వెల్లడించారు.
విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో కాసేపట్లో బీజేపీ రాష్ట్ర ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశం జరగనుంది. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అధ్యక్షతన ఈ కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశంలో 26 జిల్లాల ఇంఛార్జ్‌లు పాల్గొననున్నారు. ఎలక్షన్లలో ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి అనే అంశంపై సమావేశంలో నిర్ణయించనున్నారు.
మాఘపౌర్ణమి సందర్భంగా నదీసాగర సంగమ స్థానాలు, సముద్ర స్నానాలకు భక్తులు పోటెత్తారు. ఆంధ్రాలోని కోస్తాతీరంలోని పలు ప్రాంతాలతోపాటు హంసల దీవి, భీమిలి బీచ్ వంటి నదీ సంగమ స్థానాలు భక్తజన సంద్రమయ్యాయి. మకర సంక్రమణం మొదలు కుంభ సంక్రమణం మధ్య కాలం మాఘమాసం. ఈ మాసంలో పుణ్యస్నానాలు ఫలప్రదమన్నది శాస్త్రవచనం.
టీడీపీ-జనసేన పార్టీల తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానున్న నేపథ్యంలో సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో సీనియర్ నేతలైన అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్‌బాబు, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్‌తో సమావేశమయ్యారు.
తిరుపతి అభివృద్ధికి టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తుందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు. తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని మూడోసారి నిర్వహించుకుంటున్న తరుణంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.
రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఏపీకి కేటాయించిన ఎయిమ్స్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ ఆధునిక వైద్య దేవాలయాన్ని రేపు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. మంగళగిరి ఎయిమ్స్‌ను ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నారు. అలాగే 9 క్రిటికల్ కేర్ యూనిట్లకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు.