ఇతర దేశాల నుంచి సేకరించిన పాత క్షిపణి వ్యవస్థల స్థానంలో బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి భారత నావికాదళానికి ప్రాథమిక ఆయుధంగా ఉంటుందని భారత నావికాదళ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ సోమవారం తెలిపారు.
గాజాలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో పాలస్తీనా ప్రధాని మహ్మద్ సయ్యే తన పదవికి ఇవాళ రాజీనామా చేసారు. దేశాధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌కు తన రాజీనామాను సమర్పించినట్లు పాలస్తీనా ప్రధాని మహ్మద్ సయ్యే తెలిపారు.
భారత్ ఇప్పుడు పెద్ద కలల కంటోందని.. కలలను నెరవేర్చడానికి పగలు, రాత్రి పని చేస్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సుమారు రూ.41,000 కోట్ల విలువైన 2,000 కంటే ఎక్కువ రైలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు.
విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు. ఆదివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
బ్యాంక్ కస్టమర్లకు బ్యాంకుల్లో ఎప్పుడూ ఏదో పని ఉంటూనే ఉంటుంది. అందుకే బ్యాంకుల్లో ఏదైనా పని కోసం వెళ్లాలంటే.. ముందుగా బ్యాంక్ సెలవులపై అవగాహన ఉండాలి. బ్యాంక్ ఏరోజు పనిచేస్తుందో.. ఏరోజు సెలవు ఉందో తెలుసుకోవాలి. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ఇంకొన్ని రోజులే ఉన్నాయి. అందుకే ఇప్పుడు మార్చి నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో తెలుసుకోవాలి.
ఇంటర్నేషనల్ నంబర్స్‌తో విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది. శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అంతర్జాతీయ కాల్స్ ద్వారా ఫోన్ చేసి దుర్భాషలాడుతూ చంపేస్తామని బెదిరించినట్లు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికార వైసీపీ ఓడించాలనే లక్ష్యంతో ఇరు పార్టీలు జాబితాను విడుదల చేశాయి. ఈ క్రమంలోనే సీట్లు దక్కని నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రోజంతా బుజ్జగింపులతో చంద్రబాబు బిజీ బిజీగా గడిపారు.
మంగళగిరి ఎయిమ్స్‌ను పేదల కోసం ఉపయోగపడేలా ప్రధాని మోడీ ఏర్పాటు చేశారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. తెలుసుకోవాలని లేనివాళ్ళు ఎప్పటికీ తెలుసుకోలేరు... మోదీ ప్రభుత్వం చేసిన మార్పులను అని ఆయన వ్యాఖ్యానించారు.