టర్కీ నుంచి కొనుగోలు చేసిన డ్రోన్లతో నిఘా ప్రారంభించినట్లు మాల్దీవుల జాతీయ రక్షణ దళం (ఎంఎన్‌డీఎఫ్) తెలిపింది. టర్కీతో ఒప్పందం ప్రకారం కొనుగోలు చేసిన డ్రోన్ విమానాన్ని చూపే వీడియోను కూడా ఎంఎన్‌డీఎఫ్ షేర్ చేసింది.
బీహార్‌లో శాసన మండలి ఎన్నికల్లో ఓటింగ్ జరగకుండానే మొత్తం 11 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనమండలిలో 11 స్థానాలు ఖాళీ కాగా.. ఇందులో, ఎన్‌డీఏకు చెందిన ఆరుగురు అభ్యర్థులు, మహాకూటమికి చెందిన ఐదుగురు అభ్యర్థులు మినహా.. 12వ పోటీదారు ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. ఈ క్రమంలో అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి దళిత మహిళను పెళ్లి చేసుకునేందుకు తన గుర్తింపును దాచిపెట్టినందుకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తబ్రేజ్ ఆలం అనే నిందితుడు తన పేరును ఆర్యన్ ప్రసాద్‌గా మార్చుకుని గోరఖ్‌పూర్‌లో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నట్లు ఆ మహిళకు అబద్ధం చెప్పాడు.
మనోహర్ లాల్ ఖట్టర్ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ వరకు.. త్రివేంద్ర సింగ్ రావత్ నుంచి బసవరాజ్ బొమ్మై వరకు బీజేపీ మాజీ ముఖ్యమంత్రులు, రాష్ట్ర పెద్దలను లోక్‌సభ ఎన్నికలలో పోటీకి దింపుతోంది బీజేపీ.
సీఏఏపై చట్టపరంగా, రాజకీయంగా పోరాడుతామని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) రాజ్యసభ ఎంపీ, సీపీఐ కేరళ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వం గురువారం అన్నారు. సీఏఏ అమలును సవాల్ చేస్తూ ఆయన గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను నిషేధించే ప్రతిపాదన బుధవారం యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ఆమోదించబడింది. టిక్‌టాక్‌పై నిషేధం తర్వాత చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది
పంజాబ్ నుంచి లోక్‌సభ ఎన్నికలకు 8 మంది అభ్యర్థులతో ఆమ్ ఆద్మీ పార్టీ తన మొదటి జాబితాను గురువారం ప్రకటించింది. ఈ జాబితాలో ఐదుగురు కేబినెట్ మంత్రులు ఉన్నారు.
: భారత్‌పై ప్రమాదకర ప్రణాళికలు రచిస్తున్న చైనా.. ఇప్పుడు భారత్ చుట్టూ పక్క దేశాల్లో సైనిక స్థావరాలను నిర్మించేందుకు సిద్ధమవుతోంది. భారత్‌కు పొరుగున ఉన్న శ్రీలంక, పాకిస్థాన్, మయన్మార్, చైనా, క్యూబా, స్నేహపూర్వక దేశమైన యూఏఈ, సీషెల్స్, తజికిస్థాన్, టాంజానియా వంటి దేశాలు కూడా సైనిక స్థావరాలను నిర్మించే అవకాశాలపై కసరత్తు చేస్తున్నాయని అమెరికా ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ తాజా నివేదిక వెల్లడించింది.