ఎలక్టోరల్ బాండ్ల పథకంపై విచారణ జరిపించాలని, విచారణ పూర్తయ్యే వరకు బీజేపీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం డిమాండ్ చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిలు మహానటులు..ఒకరిని మించి మరొకరు తమ నటనతో బనగానపల్లె ప్రజలకు మాంచి యాక్షన్ కామెడీ సినిమా చూపించారని, తమ అసమర్థతను తామే ఘనంగా చాటి చెప్పుకున్నందుకు ధన్యవాదాలు అని బనగానపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఈ రోజుల్లో వేగంగా మారుతున్న జీవనశైలి ప్రజలను అనేక సమస్యలకు గురిచేస్తోంది. పెరుగుతున్న పని ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా మన నిద్రను కూడా ప్రభావితం చేస్తాయి. ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమికి గురవుతున్నారు.
టైటానిక్.. ఇప్పటి తరాలు ఆ షిప్‌ను చూడకపోయినా అందరికీ తెలిసిన పదమే.. టైటానిక్ చిత్రాన్ని చూసి ఎంతో మంది ఆ పడవ వృత్తాంతం గురంచి తెలుసుకున్న వాళ్లు ఉంటారు. సముద్రంలో మునిగి దశాబ్దాలవుతున్నా అందరికీ ఇంకా గుర్తే. కారణం టైటానిక్ నేపధ్యంలో తీసిన సినిమా. పదేళ్ల క్రితం ఓ కోటీశ్వరుడు టైటానిక్ 2 దింపుతానని ప్రకటించినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. లండన్‌లో రిట్జ్ హోటల్‌లో అపర కోటీశ్వరుడు క్లైవ్ పామర్ చేసిన ప్రకటన ఇది. ఇప్పుడు మరోసారి టైటానిక్ 2 నిర్మాణం వార్తల్లో నిలుస్తోంది.
లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు షాకుల మీద షాక్‌లు తగులుతున్నాయి. పంజాబ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ చబ్బేవాల్ తక్షణమే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అనంతరం ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు.
ఎలక్టోరల్ బాండ్లపై దేశంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ విషయంలో సుప్రీంకోర్టు కఠినమైన తీర్పును ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్ని జాబితాలను బహిరంగపరచాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల తర్వాత, ఎన్నికల విరాళాలు ఇచ్చే కంపెనీల జాబితా, స్వీకరించే పార్టీల విరాళాల జాబితాను ఎన్నికల సంఘం బహిరంగపరిచింది.
త్తగా ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో ఈ రోజు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో పబ్లిక్ కార్యకలాపాలను ప్రారంభించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా నీటి అడుగున ప్రయాణించే మొదటి రైడ్‌లో ప్రయాణించేందుకు ప్రయాణికులు క్యూలో నిల్చున్నారు.
రాష్ట్రాన్ని వైసీపీ కబంద హస్తాల నుంచి కాపాడాలంటే అది టీడీపీ-జనసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు . విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన పార్టీ కార్యాలయాన్ని గురువారం యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు.
ఏపీలోని తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో స్పల్పంగా భూప్రకంపనలు సంభవించాయి. నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట, ఓజిలి, దొరవారిసత్రం, పెళ్లకూరు మండలాలలో స్వల్పంగా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.