జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రైల్వేకోడూరు అసెంబ్లీ అభ్యర్థిని జనసేన అధిష్ఠానం మార్చేసింది. రైల్వే కోడూరు అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును పవన్ ఖరారు చేశారు.
అనపర్తి నుంచి టీడీపీ అభ్యర్దిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరు ప్రకటించిన తరువాత ఆ సీటు బీజేపీకి కేటాయించారు. ఈ క్రమంలోనే ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో బీజేపీ నేతల మంతనాలు జరుపుతున్నారు. బీజేపీలో చేరాలని ఆయనను ఆహ్వానిస్తున్నారు.
ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఆయన చేపట్టిన ఈ యాత్ర గురువారం మధ్యాహ్నం తిరుపతి జిల్లా చిన్నసింగమలకు చేరుకుంది. చిన్నసింగమలలో లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ముద్రగడ పద్మనాభం ఫైర్ అయ్యారు. హైదరాబాద్, విజయవాడలో ఉన్న ఆస్తులు అమ్మేసి పిఠాపురం వచ్చేయమనండి.. అప్పుడు గౌరవం ఇస్తామని ఆయన అన్నారు.
విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై కోల్‌కతా ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది.
ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న టీడీపీ ఆఫీసులో బుధవారం దుత్తలూరు, వరికుంటపాడు మండలాల ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ సమీక్ష నిర్వహించారు.
ఐపీఎల్ చరిత్రలో రికార్డులకు తెలుగు రాష్ట్రాలు వేదికయ్యాయి. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు హైదరాబాద్‌లో ఇటీవల నమోదు కాగా.. నేడు 2వ అత్యధిక స్కోరు వైజాగ్‌లో నమోదైంది.
విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఐపీఎల్ 2024 16వ మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు సిక్సర్ల, ఫోర్లతో విరుచుకుపడ్డారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది.