Producer: సినీ పరిశ్రమలో విషాదం.. ఇంట్లో శవమై కనిపించిన ప్రముఖ నిర్మాత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kannada producer Soundarya Jagadish found dead at his Bengaluru home: సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. కన్నడ సినీ నిర్మాత సౌందర్య జగదీష్ ఏప్రిల్ 14, ఆదివారం బెంగళూరులోని తన ఇంట్లో శవమై కనిపించారు. ఆయనను రాజాజీనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మహాలక్ష్మి పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నివేదికల ప్రకారం ఆత్మహత్య కోణంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంత్యక్రియల నిమిత్తం సౌందర్య జగదీష్ మృతదేహాన్ని ఆయన స్వగృహంలో ఉంచారు. కన్నడ నటుడు దర్శన్ కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. కన్నడ నిర్మాత, దర్శకుడు తరుణ్ సుధీర్ తన స్నేహితుడికి ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. “సౌందర్య జగదీష్ సార్ ఆకస్మిక మరణ వార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యాను. కన్నడ చిత్ర పరిశ్రమలో ఆయన మృతి ఎంతో లోటును కలిగిస్తుంది. ఆయనకుటుంబ సభ్యులకు, ప్రియమైనవారికి (sic) హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను.” అని పోస్ట్ చేశారు.
Read Also: Shaitaan OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Also Read
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ఇటీవల, సౌందర్య జగదీష్ తన జెట్ లాగ్ పబ్ అనుమతించదగిన సమయానికి మించి నడుపుతున్నట్లు ఆరోపణలు రావడంతో వివాదంలో చిక్కుకున్నారు. పనివేళలకు మించి పార్టీ నిర్వహించినందుకు పబ్‌పై కేసు నమోదైంది. ఈ పార్టీకి ప్రముఖ నటులు దర్శన్, ధనంజయ్, రాక్‌లైన్ వెంకటేష్ తదితరులు హాజరయ్యారు. విచారణలో దర్శన్‌ను ప్రశ్నించారు. పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో, సంస్థ విందు ఏర్పాటు చేసిందని, పార్టీని కాదని పేర్కొన్నారు. దీంతో ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ ఊరట లభించింది.
జగదీష్ ‘అప్పు పప్పు’, ‘స్నేహితారు’, ‘రామ్లీల’, ‘మస్త్ మజా మాది’ వంటి అనేక చిత్రాలను నిర్మించి ప్రసిద్ది చెందారు. కన్నడ చిత్ర పరిశ్రమలో అత్యంత ఇష్టపడే నిర్మాతలలో సౌందర్య జగదీష్ ఒకరు. ఆయన ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులు, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
తాజావార్తలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..