Ajith Kumar: అజిత్ కుమార్ ‘విడాముయర్చి’ ఫస్ట్ లుక్ విడుదల..
- అజిత్ కుమార్ విడాముయర్చి ఫస్ట్ లుక్ రిలీజ్
- అజిత్ స్టైలిష్ లుక్‌కు ఫిదా అవుతున్న అభిమానులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajith Kumar: అగ్ర కథానాయకుడు అజిత్‌కుమార్, లైకా ప్రొడక్షన్స్ కలయికలో మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘విడాముయర్చి’. ఈ క్రేజీ కాంబోలో సినిమా అనగానే అభిమానులు సహా అందరిలో సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. అసలు సినిమాలో అజిత్ లుక్ ఎలా ఉంటుంది.. మూవీ ఎలా ఆకట్టుకోనుందంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూడసాగారు. ఆ సమయం వచ్చేసింది.. అందరి అంచనాలను మించేలా ‘విడాముయర్చి’ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.
‘విడాముయర్చి’ సినిమా ప్రారంభం నుంచి కోలీవుడ్ సహా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టాప్ స్టార్స్, టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమాలో భాగమయ్యారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్స్‌తో భారీ బడ్జెట్ చిత్రాలు, డిఫరెంట్ కంటెంట్ బేస్డ్ సినిమాలను నిర్మిస్తోన్న టాప్ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్. ఈ సంస్థ అధినేత సుభాస్కరన్..‘విడాముయర్చి’ సినిమాను నిర్మిస్తున్నారు. ఆద్యంతం ఆకట్టుకునే ఎంటర్‌టైన్మెంట్ చిత్రాలతో పాటు విలక్షణమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా పేరున్న మగిళ్ తిరుమేని అజిత్‌తో భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
Read Also: Allari Naresh: అల్లరి నరేష్‌తో నూతన చిత్రాన్ని ప్రకటించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
అజిత్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీ ‘మంగాత’ (తెలుగులో గ్యాంబ్లర్)లో అజిత్ కుమార్, త్రిష, యాక్షన్ కింగ్ అర్జున్ త్రయం తమదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మరోసారి వీరు ముగ్గురు ప్రేక్షకులను మెప్పించనున్నారు. ఇంకా ఈ చిత్రంలో ఆరవ్, రెజీనా కసాండ్ర, నిఖిల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ హెడ్ జి.కె.ఎం.తమిళ్ కుమరన్ మాట్లాడుతూ ‘‘మా బ్యానర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా విడాముయర్చి చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఇప్పుడు విడుదల చేయటం మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. అజిత్‌తో సినిమా చేస్తున్నామని ప్రకటించినప్పటి నుంచి అభిమానులు, ప్రేక్షకులు వారి సపోర్ట్‌ను అందిస్తున్నారు. వారికి చక్కటి సినిమాను అందించటమే మా లక్ష్యం. అందుకనే మా టీమ్ ఎంతగానో కష్టపడుతుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆగస్ట్ నెలలో సినిమా చిత్రీకరణను పూర్తి చేస్తాం. తర్వాతే సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుందనే దాని గురించి అధికారికంగా తెలియజేస్తాం’’ అన్నారు.
కోలీవుడ్ మ్యూజికల్ రాక్ స్టార్ అనిరుధ్ ఇప్పటికే చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను సిద్ధం చేశారు. ఓం ప్రకాష్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. ఎన్.బి.శ్రీకాంత్ ఎడిటర్‌గా, మిలాన్ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి సుందర్ స్టంట్స్‌ను కంపోజ్ చేస్తుండగా, అను వర్ధన్ కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. సుబ్రమణియన్ నారాయణన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, జె.గిరినాథన్, కె.జయశీలన్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్‌గా వర్క్ చేస్తున్నారు. ఇంకా జి.ఆనంద్ కుమార్ (స్టిల్స్), గోపీ ప్రసన్న (పబ్లిసిటీ డిజైనర్), హరిహరసుతన్(వి.ఎఫ్.ఎక్స్), సురేష్ చంద్ర (పి.ఆర్.ఒ-తమిల్), నాయుడు సురేంద్రకుమార్- ఫణి కందుకూరి (పి.ఆర్.ఒ-తెలుగు) సినిమాలో భాగమై వర్క్ చేస్తున్నారు. అజిత్ కుమార్ ‘విడాముయర్చి’ సినిమా శాటిలైట్ హక్కులను సన్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది.
Presenting the much-awaited first look of #VidaaMuyarchi 🤩 Brace yourselves for a gripping tale where perseverance meets grit. 🔥🎬#AjithKumar #MagizhThirumeni @LycaProductions #Subaskaran @gkmtamilkumaran @trishtrashers @akarjunofficial @anirudhofficial @Aravoffl… pic.twitter.com/ABtDSoM46S
— Lyca Productions (@LycaProductions) June 30, 2024
తాజావార్తలు
-
Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
-
Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
-
OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
-
AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!