ప్రస్తుతం జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2024లో శ్రీలంక, భారత్ జట్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది. రెండు జట్లూ తమ ప్రత్యర్థులను చిత్తు చేశాయి. నేడు శ్రీలంకలోని దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఫైనల్లో భారత మహిళా క్రికెట్ జట్టు, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
పారిస్ వేదికగా ఒలింపిక్స్-2024 క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఒలింపిక్స్ ఆరంభరోజు భారత్‌కు చెందిన అథ్లెట్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. యువ షూటర్ మనుబాకర్ మాత్రం అదరగొట్టింది. 2020 ఒలింపిక్స్‌లో మూడు విభాగాల్లో పోటీ పడి ఈవెంట్‌లోనూ ఫైనల్ చేరకుండా నిరాశపరిచిన మనుబాకర్.. ఈ సారి అంచనాలను అందుకుంటూ పోటీ పడ్డ తొలి ఈవెంట్‌లోనే ఫైనల్ చేరి పతకం మీద ఆశలు రేపింది.
కొత్త కోచ్-కెప్టెన్ ద్వయం సూర్యకుమార్ యాదవ్, గౌతమ్ గంభీర్ నేతృత్వంలో భారత్ విజయభేరీ మోగించింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తినాని హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి అరెస్టు అయ్యారు. ఎన్నికల అనంతరం మే 14వ తేదీన శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్‌రూమ్‌ల పరిశీలన నిమిత్తం వచ్చిన పులివర్తి నానిపై హత్యాయత్నం చేశారు.
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి వరద ఉధృతి మరింత పెరుగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ తెలిపారు. సెంట్రల్ వాటర్ కమిషన్ అంచనాల ప్రకారం మరో మూడు రోజులు వరద ప్రవాహం కొనసాగి ఆతర్వాత క్రమంగా తగ్గే అవకాశం ఉందన్నారు.
తిరుపతి జిల్లా వెంకటగిరిలో యువతులను, వృద్ధులను వేధిస్తున్న ఆకతాయిలని అదుపు చేయాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలకు తిరుపతి పోలీసులు తక్షణం స్పందించారు. వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీకి వెళ్ళి అక్కడి ప్రజలతో పోలీసులు మాట్లాడారు. ఆకతాయిల వివరాలు నమోదు చేసుకున్నారు.
పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో భారత బ్యాటర్లు చెలరేగారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి భారత్ 213 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (40), శుభ్‌మన్ గిల్ (34) శుభారంభం అందించగా.. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (58), రిషభ్ పంత్ (49) కూడా దంచికొట్టారు.
కర్నూలు నగర పరిధిలోని ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య కలకలం సృష్టించింది. భవనంపై నుంచి దూకి విజయనగరం జిల్లాకు చెందిన సాయి కార్తీక్ నాయుడు(19) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విద్యార్థి ట్రిపుల్ ఐటీలో ఈసీఈ మూడో సంవత్సరం చదువుతున్నాడు.
బ్యాంకాక్‌లో నంద్యాల జిల్లా వాసి కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది. నంద్యాల జిల్లా డోన్ మండలం చిన్న మల్కాపురంకు చెందిన మధు కుమార్ అనే వ్యక్తి కిడ్నాప్ అయ్యాడు. కిడ్నాప్ చేసిన దుండగులు 8 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలిసింది.