తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై తమిళ నిర్మాతల మండలి ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఆయా అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు వెల్లడించింది. అగ్రకథానాయకులు నటించిన ఏ సినిమా అయినా, విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు తీసుకురావాలని నిర్ణయించింది.
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టుగా టాక్ నడుస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ.. అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం మేరకు సెప్టెంబర్ 6న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలుపెడతారని తెలిసింది.
డైరెక్టర్ సందీప్ వంగ తన హీరోలను అంతకు మించి అనేలా చూపిస్తుంటాడు. స్పిరిట్ సినిమాలో ఇప్పటివరకు చూడని ప్రభాస్‌ను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా కటౌట్ ప్రభాస్‌ను ఇంకే రేంజ్‌లో ప్రజెంట్ చేస్తాడనే ఆసక్తి అందరిలోను ఉంది. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ డ్యుయల్ రోల్ చేస్తారనే రూమర్ తాజాగా బయటికి వచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్ కోసం ఆయన రెండు పాత్రలను రాశారట.
సాయిదుర్గ తేజ్ ఇటీవల ప్రముఖ దర్శకుడు కె. విజయ భాస్కర్ తాజా చిత్రం 'ఉషా పరిణయం; ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ చిత్రంలో తన్వి ఆకాంక్షతో పాటు దర్శకుడి కుమారుడు శ్రీ కమల్ నటించారు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సాయిదుర్గ తేజ్ తన మొదటి సినిమా గురించి ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు.
తమిళ్ రాకర్స్ భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన పైరేట్ వెబ్‌సైట్‌లలో ఒకటి. చాలా సినిమాల పైరసీ ప్రింట్లు విడుదల రోజునే తమిళ్ రాకర్స్‌లో వచ్చాయి. ఈ పైరేట్ వెబ్‌సైట్ కారణంగా అనేక సినిమాలు ఆర్థిక నష్టాలను చవిచూశాయి. ఇంతలో ధనుష్ హీరోగా తాజాగా విడుదలైన రాయన్ పైరేటెడ్ వెర్షన్‌ను అప్‌లోడ్ చేస్తూ మధురైకి చెందిన జెబ్ స్టీఫెన్ రాజ్ పట్టుబడ్డాడు.
అద్భుత రుచుల అడ్డాగా మారిన పరంపర రెస్టారెంట్.. హైదరాబాద్‌లో ఎక్కడికి వెళ్లినా.. తమ రెస్టారెంట్లు అందుబాటులో ఉండే విధంగా ప్లాన్ చేస్తూ ముందుకు సాగుతోంది. ఇష్టమైన ఆహారం కోసం.. మెచ్చిన రెస్టారెంట్‌కు వెళ్తుంటారు భోజన ప్రియులు.. మరికొందరు నచ్చిన రెస్టారెంట్ నుంచి మెచ్చిన ఆహారాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తుంటారు. ఇక వెజ్ ఫుడ్ ప్రియులు..
నంద్యాల జిల్లా వాసి బ్యాంకాక్‌లో కిడ్నాప్ అయిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగానికి బెంగుళూరు నుంచి బ్యాంకాక్ వెళ్తున్నట్టు కిడ్నాప్ అయిన మధుకుమార్ కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లాడు.