ఇండియా, శ్రీలంక జట్ల మధ్య 3 టీ-20 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఈ రోజు పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఇరు జట్ల కెప్టెన్లు కొత్తవారే. ఈ పరిస్థితిలో సూర్యకుమార్ యాదవ్, చరిత్ అసలంక విజయంతో సిరీస్‌ను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నారు.
ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు సమావేశం కొనసాగింది. నీతి ఆయోగ్ భేటీ అనంతరం కేంద్ర మంత్రితో సమావేశమై పోలవరం ప్రాజెక్టు అంశంపై చర్చించారు. తాజా ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని సీఎం చంద్రబాబు కోరారు.
గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. శబరి నది గోదావరిలో సంగమించే ప్రదేశమైన కూనవరం వద్ద గోదావరి వేగంగా పెరుగుతోంది. కూనవరం వద్ద గోదావరి ప్రస్తుతం 51 అడుగుల నీటిమట్టంతో ప్రవహిస్తోంది.చింతూరు వద్ద 40 అడుగులకు శబరి నది పెరిగింది. కూనవరం సంగమం వద్ద శబరి - గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
దేశంలో కొత్తగా విడుదల చేసిన ఐఫోన్‌ను కొనుగోలు చేసేందుకు భారతీయులు అత్యధిక మొత్తాన్ని చెల్లిస్తారు. చాలా మంది భారతీయులు యూఎస్, దుబాయ్, వియత్నాం, పన్నులు తక్కువగా ఉన్న ఇతర ప్రాంతాల నుండి తక్కువ ధరకు ఐఫోన్‌లను పొందడాన్ని ఎంచుకుంటారు. ఇప్పుడు, కొన్ని మీడియా నివేదికలు యాపిల్ కంపెనీ ఈ సంవత్సరం నుంచి భారతదేశంలో ఐఫోన్ 16 ప్రో మోడళ్లను తయారు చేయనుంది. యాపిల్ ఇప్పటికే భారతదేశంలో తాజా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్‌లతో సహా అనేక ఐఫోన్ మోడల్‌లను అసెంబ్లింగ్ చేస్తోంది
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ అగ్ని ప్రమాద ఘటన కేసులో పోలీసుల దూకుడు పెంచారు. ఈ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. సీటీయం పంచాయతీ మిట్టపల్లిలో వైసీపీ నేత, సీటీయం సర్పంచ్ ఈశ్వరమ్మ భర్త అక్కులప్ప ఇంట్లో పోలీసులు సోదాలు చేపట్టారు.
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిల్లకూరు జాతీయ రహదారిపై వరగలి క్రాస్ రోడ్ సమీపంలోని జాతీయ రహదారిపై జేసీబీల లోడుతో ఆగివున్న ట్రాలీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా.. మరో ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి.
తన కార్యాలయానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా పరిశీలిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి ఉప ముఖ్యమంత్రి తన కార్యాలయ సిబ్బందితో కలసి ప్రతి అర్జీని చదువుతున్నారు.
ఆగస్టు 15 తర్వాత ఉద్యోగులకు డీఏ ప్రకటిస్తామని.. ఉపాధ్యాయ సమస్యలపై సంఘాలతో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపారు. రైతు రుణ మాఫీ పూర్తైన వెంటనే ఆగస్టు 15 తర్వాత ఉపాధ్యాయ, ఉద్యోగులకు బకాయి ఉన్న డీఏ ప్రకటిస్తామని వెల్లడించారు.