జమ్మూకశ్మీర్ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. అమర్‌నాథ్ యాత్ర ముగిసిన వెంటనే హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌లలో ఆగస్టు 19 లేదా 20వ తేదీలోగా అసెంబ్లీ ఎన్నికలను ప్రకటించవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ఉక్రెయిన్ ఎదురుదాడికి రష్యా వణికిపోయింది. గత ఎనిమిది నెలల్లో పుతిన్ బలగాలు ఉక్రెయిన్‌లో స్వాధీనం చేసుకున్నంత రష్యా భూమిని చిన్న దాడితో ఎనిమిది రోజుల్లో ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంది. రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్ దాడితో ఆగ్రహానికి గురయ్యాడు. శత్రువులను తరిమికొట్టడానికి కుర్స్క్‌కు మరిన్ని దళాలను మోహరించాలని క్రెమ్లిన్‌కు పిలుపునిచ్చారు.
స్వాతంత్య్ర దినోత్సవంలో ప్రధాని మోడీ సుదీర్ఘ ప్రసంగం చేసి తన రికార్డును తానే అధిగమించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం నాడు 98 నిమిషాల పాటు తన సుదీర్ఘమైన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంతో 2016లో 96 నిమిషాల తన మునుపటి రికార్డును అధిగమించారు.
ఎవరైనా తన భార్య అందంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఓ భర్త తన భార్య అందంగా తయారై బయటకు వెళ్లడాన్ని సహించలేకపోయాడు. భార్య అందంగా తయారవడం ఇష్టం లేని ఆ భర్త అనేక సార్లు గొడవపడేవాడు. చివరకు నమ్మించి బయటకు తీసుకెళ్లి హత్య చేసిన ఘటన కర్ణాటకలోని రామనగర జిల్లా మాగడిలో జరిగింది.
దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రధాని పేర్కొన్నారు. శతాబ్దాల తరబడి దేశం బానిసత్వంలో మగ్గిందన్న ఆయన.. స్వాతంత్య్రం కోసం ఆనాడు 40 కోట్లమంది ప్రజలు పోరాడారని.. ఇప్పుడు మన దేశ జనాభా 140 కోట్లకు చేరిందన్నారు.
ఢిల్లీలోని ఎర్రకోటలో వరుసగా 11వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ.. బంగ్లాదేశ్‌లో బంగ్లాదేశ్‌లో ఇటీవలి రాజకీయ అశాంతి సమయంలో దాడులను ఎదుర్కొన్న హిందువుల భద్రత గురించి 140 కోట్ల మంది భారతీయులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందని, రాష్ట్రాలు మహిళల భద్రతకు భరోసా ఇవ్వాలని అన్నారు.
ఢిల్లీలోని ఎర్రకోటలో గురువారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొని ప్రధాని ప్రసంగాన్ని విన్నారు. గతంలో ఆ పదవి ఖాళీగా ఉండడంతో ప్రతిపక్ష నేత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరుకావడం ఇదే తొలిసారి.