దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోటపై జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రధాని పేర్కొన్నారు. శతాబ్దాల తరబడి దేశం బానిసత్వంలో మగ్గిందన్న ఆయన.. స్వాతంత్ర్యం కోసం ఆనాడు 40 కోట్లమంది ప్రజలు పోరాడారని.. ఇప్పుడు మన దేశ జనాభా 140 కోట్లకు చేరిందన్నారు.
దేశం ఈరోజు 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 11వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు.
దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఎర్రకోట ప్రాకారంపై నుంచి జాతీయ జెండాను ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇది ప్రధాని మోడీ చారిత్రాత్మక మూడో టర్మ్‌లో మొదటి ప్రసంగం కావడం విశేషం.ప్రధాని మోడీ జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేయడం ఇది వరుసగా 11వ సంవత్సరం.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి కోరారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా.. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ జాతీయ గీతాలాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
గాంధీ ఆస్పత్రిలో కోల్‌కతా హత్యాచార ఘటనకు నిరసన చేపట్టిన వైద్యులకు మంత్రి సీతక్క సంఘీభావం ప్రకటించారు. ఓ రోగిని పరామర్శించేందుకు గాంధీ ఆసుపత్రికి వచ్చిన మంత్రి సీతక్క.. మహిళలపై అఘాయిత్యాలను నిలువరించాలని వ్యాఖ్యానించారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీల నియామకం కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై 'స్టే' సుప్రీంకోర్టు విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు స్టే అమలులో ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.
హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, అమీర్ పేట్, గండిపేట్, తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది.
తమకు పుట్టిన పిల్లల కన్నా వాళ్లకు పుట్టిన పిల్లలనే ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు నాయనమ్మలు, అమ్మమ్మలు. మనవళ్లు, మనవరాళ్లను అల్లారు ముద్దుగా, గారాబంగా చూసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం మనవడు అన్న కనికరం లేకుండా అమ్మకానికి పెట్టేసింది. ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెంలో చోటుచేసుకుంది.