ప్రముఖ నటుడు మోహన్‌లాల్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం, కండరాల నొప్పులు, శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు కొచ్చిలోని అమృత ఆస్పత్రిలో చేర్పంచారు. ఆస్పత్రి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయనకు మందులు వాడుతూ ఐదు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిసింది.
టాలీవుడ్ స్టార్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను నేషనల్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. తెలుగులో స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఎదిగిన జానీ మాస్టర్ ఒక తమిళ సినిమాకు నేషనల్ అవార్డును దక్కించుకున్నారు. తిరుచిత్రంబళం సినిమాలో మేఘం సాంగ్‌కి గాను జానీ మాస్టర్‌కి నేషనల్ అవార్డు లభించింది.
జీవితాంతం తోడుంటానని అగ్నిసాక్షిగా వివాహమాడిన భర్తే ఆమెపాలిట కాలయముడై భార్యను అతి కిరాతకంగా చంపాడు. భార్యను చంపడమే కాకుండా ఎవరికీ అనుమానం రాకుండా రైల్వే ట్రాక్‌పై పడేశాడు ఆ దుర్మార్గపు భర్త. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని దూళ్లవానిగూడెంలో చోటుచేసుకుంది.
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం హంసలదీవి బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. గుడివాడకు చెందిన ఐదుగురు సముద్రంలో కొట్టుకుపోతుండగా.. ముగ్గురిని తోటి పర్యాటకులు, మెరైన్ పోలీసులు కాపాడారు. ఇద్దరు సముద్రంలో గల్లంతు కాగా.. ఒకరి మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది.
పశ్చిమ బెంగాల్ పోలీసుల సోషల్ మీడియా పోస్ట్‌పై చాలా దుమారం చెలరేగుతోంది. ఆగస్ట్ 14 రాత్రి నిరసనకారుల దాడిలో గాయపడిన మహిళా కానిస్టేబుల్ గాయంపై బెంగాల్ పోలీసులు ఈ పోస్ట్ చేశారు. కోల్‌కతాలోని మెడికల్ కాలేజీకి చెందిన ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.
కోల్‌కతా ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ వద్దకు చేరింది. ఆర్మీ కాలేజీకి చెందిన వైద్యుడి పిటిషన్‌తో సహా మూడు లేఖ పిటిషన్లు సీజేఐకి పంపబడ్డాయి. ఈ భయంకరమైన ఘటనపై సీజేఐ స్వయంచాలకంగా స్పందించి, త్వరితగతిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ఈ పిటిషన్లలో పేర్కొన్నారు.
సూడాన్‌లోని సిన్నార్ ప్రావిన్స్‌లో ఉన్న ఒక గ్రామంలో పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) నరమేధం సృష్టించింది. ఐదు రోజుల ముట్టడి తర్వాత సిన్నార్ ప్రావిన్స్‌లోని జలక్ని గ్రామంలోని అబూ హుజార్ ప్రాంతంలో గురువారం ఆర్‌ఎస్‌ఎఫ్ కాల్పులు జరిపింది. ఈ దాడిలో 80 మంది చనిపోయారు.
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ స్వదేశానికి చేరుకుంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఆమెకు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. వినేష్ ఢిల్లీకి తిరిగి రావడానికి ముందే, భారత రెజ్లర్ అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇప్పటికే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడారు.