హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎస్బీఐ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, ఎస్బీఐ సీజీఎం రాజేష్ కుమార్, డీజీఎంజితేందర్ శర్మ , ఏజీఎం దుర్గా ప్రసాద్, తనుజ్‌లు పాల్గొన్నారు. వరదల నేపథ్యంలో తెలంగాణ ఎస్బీఐ ఉద్యోగుల ఒకరోజు వేతనం రూ.5కోట్లు సీఎం సహాయనిధికి ఎస్బీఐ ప్రతినిధులు విరాళంగా అందించారు.
హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం విద్యా శాఖ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన రవీంద్ర భారతిలో గురు పూజోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు.
ఏ వ్యక్తి ఎదగడానికైనా, ఏ విద్యార్థి అయినా ప్రయోజకుడు కావాలన్నా వారి జీవితంలో గురువుల పాత్ర చాలా కీలకం. గురువు అంటే కేవలం విద్య నేర్పే వారు మాత్రమే కాదు.. ఆశయాలకు అనుగుణంగా శిష్యుడిని తీర్చిదిద్దే ప్రతి ఒక్కరు గురువే. విద్యార్థుల జీవితాల్లో విజ్ఞానమనే వెలుగులు నింపేవారే గురువులు. ఈ దేశంలో చాలా మంది గొప్ప గురువులు ఉన్నారు. లోకం మెచ్చిన గురువులూ ఉన్నారు. పురాణాల్లో ఎంతో మంది గురువులు ఉన్నారు. కానీ కొంత మందే చరిత్రలో నిలిచిపోయారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్‌లో 8 ట్రాక్‌లతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ శంకుస్థాపన చేశారు. ఒలంపిక్ స్థాయిలో శిక్షణ ఇచ్చిన ఘనత నిజామాబాద్‌కు ఉందని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.