ఆంధ్రప్రదేశ్‌లోని బస్సు ప్రమాదం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం గుమ్మలకుంట సమీపంలో పల్లె వెలుగుబస్సు బోల్తా పడింది. నల్లమాడ నుంచి అనంతపురంకు వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరు వాడ మొత్తం గణేశుని నామస్మరణంతో మారుమోగుతోంది. లంబోధరుడిని వివిధ రూపాల్లో కొలువుతీర్చి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గణేష్ మండపాల వద్ద విద్యుత్ కాంతుల శోభతో ప్రత్యేక కళను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా వివిధ రూపాల్లో వినాయకుని విగ్రహాలు కళకళలాడుతున్నాయి.
Balapur Ganesh Laddu: వినాయక చవితి.. ప్రపంచంలో హిందువులు ఏ ఖండంలో ఉన్నా చేసుకునే పెద్ద పండుగ. మన దేశంలో ప్రజలు సామూహికంగా మండపాలను ఏర్పాటు చేసి అత్యంత భక్తిభావంతో జరుపుకునే పండుగ వినాయక చవితి. ప్రత్యేక రూపాల్లో చేసిన గణపతులు ఒక ఎత్తు అయితే.. లడ్డు వేలం పాట మరొక ఎత్తు. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో అయితే ఈ శోభ పతాకస్థాయిలో ఉంటుంది. ఈ పండుగను మిగతా ప్రాంతాల్లో పోలిస్తే హైదరాబాద్‌లో ఘనంగా జరుపుకుంటారు.
తిరుమలలో విషాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో గుండెపోటుతో మహిళ మృతి చెందింది. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లో ఈ ఘటన జరిగింది.
బుడమేరుకు పడ్డ గండ్లను పూడ్చే పనులను యుద్ధప్రాతిపదికన చేస్తున్నాయి. బుడమేరు గండ్లను ఇవాళ పూడ్చేయాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. ఆర్మీ సాయంతో మూడో గండి పూడ్చివేత పనులను అధికారం ముమ్మరం చేశారు. గాబీయన్ బాస్కెట్ విధానంలో పనులు జరుగుతున్నాయి.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం లాలాచెరువు సమీపంలోని గోదావరి మహా పుష్కర వనం - హౌసింగ్ బోర్డ్ కాలనీల సమీపములో అర్ధరాత్రి చిరుతపులి సంచరించిన నేపథ్యంలో అటవీశాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
తెలంగాణలో వరద, వర్ష ప్రభావంతో తీవ్ర నష్టం జరిగిందన కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. ఖమ్మంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్, రాష్ట్ర మంత్రులతో కలిసి పర్యటన చేశామన్నారు. సెక్రటేరియట్‌లో సమీక్ష చేపట్టామని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా ముందుకొస్తున్నాయి. ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువెత్తుతున్నాయి.