వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు సింగూరులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో సింగూరు ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యానికి నీటిమట్టం చేరుకోవడంతో గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరితో కలిసి ప్రాజెక్టు వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2025.. ఆగస్ట్ 20 నుంచి ప్రారంభమైందని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. రాబోయే నాలుగు నెలలు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు.
భారీ వర్షాలకు తెగిపోయిన చెరువుకట్టలు, కెనాల్స్ పునరుద్ధరణకు వారం రోజుల్లో టెండర్లు పిలవాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించారు. చెరువులు, కాలువల పునరుద్ధరణతో పాటు పాక్షికంగా దెబ్బతిన్న చెరువులు, కాలువల మరమ్మతులకు కూడా టెండర్ల ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలన్నారు.
గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు జరగరాదని, అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి ఎల్‌బీ నగర్ జోన్‌లో పర్యటించి గణేష్ నిమజ్జనానికి చెరువులు, బేబీ పాండ్స్ సంసిద్ధత, ఏర్పాట్లను పరిశీలించారు.
ప్రకృతిని చెర బడితే అది ప్రకోపిస్తుందని.. ప్రకృతి ప్రకోపంతోనే ఉత్తరాఖండ్‌లోనైనా, మన దగ్గరైనా విపత్తులు సంభవిస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భారీ వర్షాల సమయంలో వరదలు సంభవించి కాలనీలకే కాలనీలే మునిగిపోవడానికి కారణం చెరువులు, నాలాల ఆక్రమణే కారణమన్నారు. హైడ్రాను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనే డిమాండ్ వస్తోందని, కానీ ఎక్కడికక్కడ కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువుల్లో ఆక్రమణ తొలగింపును ప్రాధాన్యంగా పెట్టుకున్నామని, చెరువులు, నాలాల ఆక్రమణలో ఎంతటి వారున్నా తొలగింపునకు వెనుకాడబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను ఈ వారాంతంలోగా సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం అంచనా వేయడంపై సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలతో సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఇంటర్ కాంటినెంటల్ కప్ (4వ ఎడిషన్) 2024 జరుగుతోంది. ఈ ఫుట్ బాల్ టోర్నమెంట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ టోర్నమెంట్‌లో ఇండియా, మారిషస్, సిరియా దేశాలు పాల్గొంటున్నాయి.
తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు రేవంత్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రీప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీకి ఈ కమిషన్ ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో 117 గ్రామాలలో 67 వేల మంది భారీ వర్షాలు, వరదల వల్ల ప్రభావితమయ్యాయని మంత్రి చెప్పారు.