మంత్రి అవునంటే.. కార్పొరేషన్ ఛైర్మన్ కాదంటారు. ఛైర్మన్ ఓకే చెబితే.. మంత్రి నో అంటారు. ఇద్దరి మధ్య నెలకొన్న పవర్ ఫైట్ వల్ల కొన్నాళ్లుగా కీలక నిర్ణయాల్లేవ్. అన్నీ సమస్యలే. ఇంతకీ ఎవరువారు? ఏంటా విభాగం? లెట్స్ వాచ్..! కలిసి సమీక్షల్లేవ్.. కీలక నిర్ణయాలు లేవు..! గంగుల కమలాకర్. తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి. మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఛైర్మన్. ఇద్దరి మధ్య మొదటి నుంచి సత్సంబంధాలు లేవు. ఒకరు ఎడ్డెమంటే.. ఇంకొకరు […]
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు…హుజురాబాద్ ఉప ఎన్నిక ఓటరు చావుకొచ్చింది. ఈ ఎన్నికల ప్రచారం వారికి పెద్ద తలనొప్పిగా పరిణమించింది. దాదాపు ఐదు నెలల నుంచి నియోజకవర్గం ప్రజలు వింత సమస్యని ఎదుర్కొంటున్నారు. రోజుకు కనీసం పది నుంచి పన్నెండు మంది గుంపు ఇంటికి వచ్చి దండం పెట్టి మరీ టార్చర్ చేస్తున్నారు. ఒక గ్రూపు అటు తిరగారో లేదో..ఇటు ఇంకో గ్రూపు రెడీ. కండువాలే తేడా..సీన్ మాత్రం ఒకటే. నేతలు ఇంటికి వచ్చి ఓటేయమని అడగటం […]
హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం తారాస్థాయికి పీక్‌కి చేరింది. ఈ నెల 27తో ప్రచార పర్వానికి ఎండ్ కార్డు పడనుంది. ఎంత ప్రచారం చేసినా ఇంకో నాలుగు రోజులే. దీంతో ప్రధాన పార్టీలకు చెందిన ప్రముఖులు నియోజకవర్గంలోని ఐదు మండలాలను సుడిగాలిలా చుట్టేస్తున్నారు. హుజూరాబాద్ పట్టణం మొదలుకుని మారుమూల పల్లెలల వరకు ..వీధి వీధిన ..గల్లీ గల్లీలో ప్రచార హోరు వినిపిస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు రోడ్ షోలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. రెండు చేతులు జోడించి […]
సాధారణ ఎన్నికలైనా.. ఉపఎన్నికైనా రోడ్‌షోలు.. బహిరంగ సభలు కామన్. ఈ రెండు లేకుండా సాగుతోంది హుజురాబాద్ బైఎలక్షన్. నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోనూ సభలకు EC నో చెప్పడంతో ప్రత్యామ్నాయాలపై పడ్డాయి పార్టీలు. ఇంతకీ ఎన్నికల సంఘం విధించిన ఆంక్షలపై పార్టీలు హ్యాపీగా ఉన్నాయా.. బాధపడుతున్నాయా? ఆంతరంగిక చర్చల్లో జరుగుతున్న సంభాషణలేంటి? ఈసీ ఆంక్షలపై హుజురాబాద్‌లో చర్చ..! హుజురాబాద్‌లో ఈ నెల 30న పోలింగ్.. 27తో ప్రచారం ముగింపు. ప్రచారానికి మిగిలి ఉన్న ఈ కొద్దిరోజులనే కీలకంగా […]
ఈ నెల 25 న ప్లీనరీలో పార్టీ అధ్యక్షున్ని ఎన్నుకుంటామని.. గులాబీ దుస్తులు ధరించి ప్రతినిధులు ప్లీనరీకి రావాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పేర్కొన్నారు. హైటెక్స్ లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… దశాబ్దాల తెలంగాణ కలను టీఆర్ఎస్ సాకారం చేసిందని.. బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పిన బోధించు సమీకరించు పోరాడు అన్న మాటల స్ఫూర్తితో ఉద్యమాలను కొనసాగించామని తెలిపారు. 14 ఏళ్ల పాటు […]
తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే చర్చ నడుస్తోంది. గడిచిన ఐదు నెలలుగా హుజూరాబాద్ లో రాజకీయ వేడిరాజుకుంటోంది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారాన్ని పెద్దఎత్తున చేపడుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో ప్రచారానికి తెరపడుతుండటంతో ఆయా పార్టీల ముఖ్య నేతలంతా కూడా హుజూరాబాద్ లోనే తిష్టవేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. […]
దేశ వ్యాప్తంగా కోవిడ్ టీకా పంపిణీ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే దేశంలోని వంద కోట్ల మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరికొత్త రికార్డును నెలకొల్పాయి. ప్రస్తుతం దేశంలో 18ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి ఉచితంగా టీకాలను పంపిణీ చేస్తున్నారు. ఒక్కొక్కరు రెండు డోసులను తప్పనిసరిగా వేసుకోవాల్సి ఉంటుంది. మొదటి డోస్ పూర్తి చేసుకున్న 90రోజులకు సెకండ్ డోస్ వేసుకోవాల్సి ఉంటుంది. ప్రజలంతా కరోనాపై అవగాహన పెంచుకొని కోవిడ్ టీకాలను వేయించుకుంటున్నారు. అయితే […]
తెలంగాణ రాష్ట్రంలోని పోడు భూముల సమస్య పరిష్కారం పై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కాసేపటి క్రితమే ప్రగతి భవన్ లో ప్రారంభమైన ఈ సమీక్షా సమావేశంలో అడవుల పరి రక్షణ, హరిత హారంపై చర్చిస్తున్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందించనున్నారు. అడవులు అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై, హరిత హారం ద్వారా విస్తృత ఫలితాల కోసం ప్రణాళికలపై చర్చించనున్నారు. పోడు సమస్యపై అటవీ, గిరిజన సంక్షేమ శాఖల […]
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. టీఆర్ఎస్ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ ఇంకా క్షేత్రస్థాయిలో బలపడాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించారు. ఈమేరకు గులాబీ బాస్ ఆదేశాలతో నేతలంతా ఆయా జిల్లాలో టీఆర్ఎస్ సభ్యత్వాలను రికార్డు స్థాయిలో నమోదు చేయించి సంస్థాగత ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే గ్రామ, పట్టణ, మండల కమిటీల ఎంపికను టీఆర్ఎస్ అధిష్టానం దాదాపు పూర్తి చేసింది. ఇక జిల్లా కమిటీలు సైతం సెప్టెంబర్ లేదా అక్టోబర్ […]
అమరావతి : తెలుగు దేశం ముఖ్య నేతలతో భేటీ అయ్యారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. చంద్రబాబు తో జరిగే సమావేశానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు యనమల, పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. సోమవారం ఢిల్లీ పర్యటన ఉన్న నేపథ్యంలో సీనియర్ నేతలతో భేటీ అయ్యారు చంద్రబాబు. సోమవారం రాష్ట్రపతిని కలవనున్నారు చంద్రబాబు మరియు టీడీపీ నేతలు. రాష్ట్రపతి తో పాటు ఇంకా ఎవరెవర్ని కలవాలనే దానిపై నేతలతో ఇవాళ చర్చించారు చంద్రబాబు. ఇక […]