మరో వారం రోజుల్లో హుజురాబాద్ ఉపఎన్నిక జరగనుంది. ప్రచారానికి మిగిలింది మరో నాలుగు రోజులే. దీంతో ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీలు ప్రచారాన్ని స్పీడప్ చేశాయి. ముఖ్య నేతలంతా అక్కడే మకాం వేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ప్రజా నాడి ఎలా ఉందనే దానిపై పరిశీలనలు చేస్తూనే.. ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకెళుతున్నారు. మూడు ప్రధాన పార్టీలు బరిలో నిలిచినా.. పోటీ మాత్రం టీఆర్ఎస్-బీజేపీ మధ్యే ఉంది. హుజురాబాద్ బైపోల్ ఈనెల 30న జరగనుంది. నవంబర్2న రిజల్ట్స్. […]
ఇండియా లో కరోనా కేసులు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. నిన్నటి రోజున భారీగా తగ్గిన కరోనా కేసులు ఇవాళ మళ్లీ పెరిగిపోయాయి. ఇక కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం … గత 24 గంటల్లో కొత్తగా 16,326 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 666 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,73,728 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం. ఇక మరో […]
మన దేశంలో పెట్రోలు ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు పెరగడం తప్ప… తగ్గుదల అసలు కనిపించడంలేదు. పెరుగుతున్న పెట్రో ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సెంచరీ కూడా దాటేశాయి. ఇక తాజాగా మరోసారి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 35 పైసలు, లీటర్ డీజిల్ పై 35 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.24 చేరగా.. లీటర్ […]
యాదాద్రి నిర్మాణం పై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి నిర్మాణం నేపథ్యంలో సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు.. తెలంగాణలో మత సామరస్యంతో కేసీఆర్ పాలన సాగుతోందన్నారు స్వరూపానందేంద్ర. రాజుల కాలం తర్వాత నిర్మాణమైన అద్భుతమైన దేవాలయం యాదాద్రి అని… సనాతన ధర్మాన్ని గుర్తించి యాదాద్రిని సీఎం కేసీఆర్ మహా క్షేత్రం గా తీర్చిదిద్దారని ప్రశంసలు కురిపించారు. సీఎం కేసీఆర్ మైలురాళ్లలో తెలంగాణ సాధనతో పాటు […]
తెలంగాణ యూనివర్సిటీలో అవుట్ సోర్సింగ్ పేరుతో ఇటీవల చేసిన నియామకాలు చెల్లవని చెప్పింది ప్రభుత్వం. అయితే నియామకాలేవి చేపట్టలేదంటూ ప్రకటించారు వీసీ. విద్యార్థి సంఘాలు, పాలకవర్గ సభ్యులు అక్రమ నియామకాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. అసలు తెలంగాణ యూనివర్సిటీలో ఏం జరుగుతోంది? ప్రభుత్వం వీసీపై ఎందుకు సీరియస్ అయ్యింది?నిజామబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని తెలంగాణ నిశ్వవిద్యాలయంలో ఔట్ సోర్సింగ్ నియామకాల వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్, రిజిస్ట్రార్ ఉద్యోగాలను అమ్ముకున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తాయి. […]
మూడు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేటి నుంచి జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఇక్కడ పౌరులే టార్గెట్ గా ఉగ్ర దాడులు జరుగుతున్న తరుణంలో పంచాయతీ సభ్యులు, రాజకీయ కార్యకర్తలతో సమావేశమవుతారు. అలాగే, కేంద్ర బలగాలతో సమావేశమై భద్రతపై సమీక్షిస్తారు.ఆగస్టు 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత షా తొలిసారి ఇక్కడ పర్యటిస్తున్నారు. ఈ నెలలో ఇక్కడ జరిగిన దాడుల్లో 11 మంది పౌరులు మరణించారు. ఈ ఘటనలతో సంబంధం ఉన్న […]
ధనాధన్ క్రికెట్‌లో అత్యున్నత పోరుకు రంగం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి సూపర్-12 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. టీ 20 ప్రపంచ కప్ టోర్నమెంట్ నేటి నుంచి వచ్చే నెల 14 వరకు యూఏఈలో నిర్వహించనున్నారు. ఇవాళ ఆరంభ మ్యాచ్‌ల్లో ఆసీస్-దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్-వెస్టిండీస్ తలపడతాయి. ఈ కప్ భారత్‌లోనే జరగాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వేదికను ఎడారి దేశానికి తరలించారు.ఈనెల 17 నుంచే క్వాలిఫయింగ్ మ్యాచ్‌లతో అధికారికంగా టీ20 ప్రపంచకప్ ఆరంభమైంది. ప్రధాన మ్యాచ్‌లు మాత్రం సూపర్-12 పేరిట […]
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి… ఇవాళ్టి విశాఖ పర్యటన రద్దు అయింది. షెడ్యూల్ ప్రకారం.. ఈ మేరకు సీఎంఓ కార్యాలయం ఓ ప్రకటన లో వెల్లడించింది. అయితే… విశాఖ టూర్ షెడ్యూల్ ప్రకారం.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు గన్న వరం విమానాశ్రమం నుంచి విశాఖ బయలు దేరాల్సి ఉంది. సాయంత్రం 5.20 గంటలకు విశాఖ చేరుకుని ఎన్‌ఏడీ జంక్షన్ లో ఫ్లై ఓవర్ తో పాటు.. వీఎంఆర్‌డీఏ పూర్తి చేసిన 6 […]
మేషం :- భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్ధలు, చికాకులు తలెత్తుతాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అవసరం. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. రాజకీయాల్లో వారికి ఒడిదుడుకులు అధికమవుతాయి. వృషభం :- పత్రికా రంగంలో వారికి ఒత్తిడి తప్పదు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. మీ మాటే నెగ్గాలన్న పట్టుదలకు పోవటం మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాలలో […]
దళితబంధు పథకం ప్రస్తుతం హుజురాబాద్ ఉపఎన్నికలో బర్నింగ్ టాపిక్..! ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత పొలిటికల్ తెరపైకి వచ్చిన ఈ అంశం.. అంతా అనుకున్నట్టే ఉపఎన్నికలో కీలకంగా మారింది. విమర్శలు.. ఆరోపణలే కాదు.. చర్చ.. రచ్చ ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. మరి.. పార్టీలు ఆశిస్తున్నట్టు ఉపఎన్నికపై ప్రభావం ఉంటుందా? కీలక అంశంగా మారిన దళితబంధు..! ఈ నెల 30న హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్. ప్రచారపర్వం చివరి అంకానికి చేరుకుంటోంది. ప్రధానపార్టీల హోరాహోరీ పోరువల్ల నియోజకవర్గంలో ఎటు చూసినా […]