తెలంగాణ రాష్ట్రంలోని పోడు భూముల సమస్య పరిష్కారం పై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కాసేపటి క్రితమే ప్రగతి భవన్ లో ప్రారంభమైన ఈ సమీక్షా సమావేశంలో అడవుల పరి రక్షణ, హరిత హారంపై చర్చిస్తున్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందించనున్నారు.
అడవులు అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై, హరిత హారం ద్వారా విస్తృత ఫలితాల కోసం ప్రణాళికలపై చర్చించనున్నారు. పోడు సమస్యపై అటవీ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు మూడు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించి అధ్యయనం చేశారు. క్షేత్ర స్థాయి పరిస్థితులపై సీఎం కేసీఆర్ కు అధికారులు నివేదిక ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం కొనసాగుతోంది.