అమరావతి : తెలుగు దేశం ముఖ్య నేతలతో భేటీ అయ్యారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. చంద్రబాబు తో జరిగే సమావేశానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు యనమల, పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. సోమవారం ఢిల్లీ పర్యటన ఉన్న నేపథ్యంలో సీనియర్ నేతలతో భేటీ అయ్యారు చంద్రబాబు.
సోమవారం రాష్ట్రపతిని కలవనున్నారు చంద్రబాబు మరియు టీడీపీ నేతలు. రాష్ట్రపతి తో పాటు ఇంకా ఎవరెవర్ని కలవాలనే దానిపై నేతలతో ఇవాళ చర్చించారు చంద్రబాబు. ఇక అటు టీడీపీ కార్యాలయాలపై దాడుల నేపథ్యంలో ఆర్టికల్ 356 పెట్టాలని టీడీపీ డిమాండ్ చేస్తుండగా… ఇప్పటికే గవర్నరును కలిసి ఆర్టికల్ 356 పెట్టాలని కోరింది. ఇక రేపు రాష్ట్రపతితో భేటీలోను ఆర్టికల్ 356 పెట్టాలని కోరనున్నారు చంద్రబాబు.