పదవి వచ్చిన మూడు నెలలకే ఆయన మూడ్ ఆఫ్ అయింది. ఛైర్మన్ పోస్ట్ ఉన్నట్టా.. లేనట్టా అని ఒక్కటే అనుమానం. కనీసం కుర్చీ కూడా లేదు. దీంతో లబోదిబోమంటున్నారట ఆ నాయకుడు. ఆయనెవరో.. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. ఛైర్మన్ పదవి ఇచ్చారు.. కుర్చీ లేదు..! రాజమండ్రి స్మార్ట్ సిటీ చైర్మన్‌గా వైసీపీ నేత చందన నాగేశ్వర్‌ను నియమించి మూడు నెలలైంది.ఇంతవరకు ఆయన బాధ్యతలు చేపట్టలేదు. ఇందుకు కారణం పదవి ఇష్టం లేక కాదు.. పదవి ఇచ్చారు […]
కుప్పం మున్సిపాలిటీ పోరు సెగలు రేపుతోంది. వైసీపీ జెండా ఎగరేయటానికి మంత్రి పెద్దిరెడ్డి అన్ని రకాల వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పుడు కొత్త అస్త్రం ప్రయోగించి చర్చకు దారితీశారు. కుప్పంలోనే టీడీపీ సీనియర్లు..! చిత్తూరు జిల్లాలోని కుప్పం.. కావటానికి మున్సిపాలిటీనే ..! ఇక్కడ పురపోరు మాత్రం హై ఓల్టేజ్ తో సాగుతోంది. గెలుపు కోసం వైసీపీ, టీడీపీ గట్టి వ్యూహాలే రచిస్తున్నాయి. అక్రమాలు జరుగుతున్నాయని వరస పెట్టి రాష్ట్ర ఎన్నికల సంఘానికి, డీజీపీకి లేఖలు రాస్తున్నారు చంద్రబాబు. […]
మంత్రి ప్రశాంత్ రెడ్డికి పేర్నినాని కౌంటరిచ్చారు. మాకు రావాల్సిన నిధుల కోసం బిచ్చమెత్తుకుంటున్నామని… మాటి మాటికి ఢిల్లీ వెళుతున్న కేసీఆర్ ఏం బిచ్చమెత్తుకోవడానికి వెళుతున్నారంటూ మండిపడ్డారు పేర్నినాని. తెలంగాణలో వరి కొనుగోళ్ళ రచ్చ జరుగుతుంటే… ఈ కొత్త గొడవేంటని రాజకీయ విశ్లేషకులు అవాక్కవుతున్నారు. విపక్షాలు మాత్రం కీలక విషయాలను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి సిల్లీ విషయాలను తెరమీదకు తెస్తున్నారని కామెంట్లు చేస్తున్నారని ఫైర్ అయ్యారు పేర్ని నాని. ఇక అంతకు ముందు తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి […]
జనంతో బాగా గ్యాప్ వచ్చిందని ఆ జిల్లాలోని ఎమ్మెల్యే, ఎంపీలు ఆందోళన చెందుతున్నారా? మళ్లీ ప్రజలకు దగ్గర య్యేందుకు డివోషనల్ బాట పట్టారా? సడెన్‌గా ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? ఇంతకీ ఎవరా నాయకులు? ప్రజాప్రతినిధుల భక్తి లెక్కలు వేరా? గుస్సాడీ నృత్యాలు.. కార్తీక దీపోత్సవాలు..! ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ వేడుకలు జోరుగా సాగుతున్నాయి. ఇవన్నీ ఏ ధార్మిక సంస్థలో నిర్వహిస్తున్నాయంటే పొరపాటు. ఫౌండేషన్ ద్వారా కొందరు.. సొంతంగా మారికొందరు తమలోని భక్తిని భారీగానే బయటపెడుతున్నారు. […]
ఏపీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ మేరకు అమిత్ షా మూడు రోజుల తిరుపతి పర్యటన షెడ్యూల్ కూడా ఖరారు అయింది. ఈ నెల 13 వ తేదీన రాత్రి తిరుపతి లో బస చేయనున్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. ఈ నెల 14 వ తేదీన ఉదయం నెల్లూరులో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కార్యక్రమంలో పాల్గొననున్నారు. 14 వ తేదీన మధ్యాహ్నం […]
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ టీఆర్‌ఎస్ పార్టీ ధర్నాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలనే ముఖ్య డిమాండ్ తో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల తరఫున టీఆర్‌ఎస్ పార్టీ ధర్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే… ఖైరతాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే… దానం నాగేందర్.. తన నియోజక వర్గం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఖైరతాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే… దానం […]
మాజీ మంత్రి, ప్రస్తుత హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్… ఒక్క సారిగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, తెలంగాణ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్… నిర్వహించిన ఓ శుభకార్యంలో సందడి చేశారు. అదేంటి… టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దగ్గరికి ఈటల రాజేందర్ వెళ్లడమేంటని అనుకుంటున్నారా ? అవును ఇది నిజమే. తెలంగాణ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ గారి కుమార్తె వివాహ వేడుకకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈటల […]
టీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రైతుల ధర్నా కార్యక్రమంలో తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నిధులు లేక ఆంధ్రా సీఎం జగన్ కేంద్రాన్ని అడుక్కుతింటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వస్తే.. అడుక్కుతింటారని ఎద్దేవా చేసిన వారే.. బిచ్చం ఎత్తుకుంటున్నారని చురకలు అంటించారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. బీజేపీ లఫంగా, బట్టెబాజ్ గాళ్ళ కు ధర్నా చేయాలని ఎలా అనిపించిందని బీజేపీ నాయకులపై కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోయారు ప్రశాంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ […]
జర్నలిస్టుల కు టీఎస్ ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. ట్విట్టర్ వేదికగా పలువురు జర్నలిస్టుల సూచన మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఇదివరకు అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులు బస్సు ప్రయాణంలో టికెట్ తీసుకునేందుకు .. ప్రత్యేక బస్సు పాస్ చూపించి 2/3 కన్సెషన్ ఆప్షన్ కింద టికెట్ తీసుకునే అవకాశం ఉండేది. తాజాగా టీఎస్ ఆర్టీసీకి చెందిన వెబ్సైట్ నుంచి కూడా టికెట్లు బుక్ చేసుకునేందుకు రాయితీతో కూడిన అవకాశం కల్పించారు […]
గెలిచే అవకాశం లేకపోయినా.. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బీజేపీ ఎందుకు దిగుతోంది? అన్ని చోట్లా పోటీ చేస్తుందా.. కేవలం కొన్ని స్థానాలకే పరిమితం అవుతుందా? ఈ విషయంలో కమలనాథుల లెక్కలేంటి? బలం లేని చోట బరిలో బీజేపీ..! తెలంగాణలో మళ్లీ ఎన్నికల వేడి నెలకొన్నా.. వార్ ఏకపక్షం కావడంతో పెద్దగా చర్చ లేదు. ఎన్నికలు జరిగే 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ప్రస్తుతం టీఆర్ఎస్‌వే. ఈ ఎన్నికల్లో ఓటేసే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్ల […]