టీఆర్‌ఎస్ పార్టీ తలపెట్టిన రైతుల ధర్నా కార్యక్రమంలో తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నిధులు లేక ఆంధ్రా సీఎం జగన్ కేంద్రాన్ని అడుక్కుతింటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వస్తే.. అడుక్కుతింటారని ఎద్దేవా చేసిన వారే.. బిచ్చం ఎత్తుకుంటున్నారని చురకలు అంటించారు మంత్రి ప్రశాంత్ రెడ్డి.
బీజేపీ లఫంగా, బట్టెబాజ్ గాళ్ళ కు ధర్నా చేయాలని ఎలా అనిపించిందని బీజేపీ నాయకులపై కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోయారు ప్రశాంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ నడవాలంటే కేంద్రం నిధులు కావాలని… కేంద్రం ఒత్తిడి తో ఏ.పి. లో రైతుల మోటర్లకు మీటర్లు పెట్టారన్నారు. దేశం మొత్తం రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలనే మోడీ ప్రయత్నం చేస్తున్నారని… తెలంగాణ లో మీటర్లు పెట్టబోమని స్పష్టం చేశారు. కేంద్రం రైతులకు చేస్తున్న మోసం పై బీజేపీ నేతలను అడుగడుగునా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి ప్రశాంత్ రెడ్డి.