తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు అంతా జట్టు కట్టారా? రేవంత్ మీద నుంచి టార్గెట్ మళ్లించారా.. లేక వ్యూహాత్మక ఎత్తుగడ ఎంచుకున్నారా? వరస భేటీల వెనక వ్యూహం ఏంటి? వారి తాజా లక్ష్యం ఎవరు? ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌పై సీనియర్ల గురి..! ఒకరికొకరు చెక్ పెట్టుకోవడంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారే దిట్ట. ఏదైనా తమ దారిలోకి రావాలని అనుకుంటారు తప్పితే.. అంతా ఒకేదారిలో నడిచే ప్రసక్తే లేదన్నట్టుగా ఉంటుంది నేతల వ్యవహార శైలి. ఒకరు యస్ […]
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ దిగ్విజయంగా ముందుకు వెళుతుంది. జపాన్ లోని భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ కోహన ఇంటర్నేషనల్ స్కూల్ లో విద్యార్థులు,ఉపాధ్యాయులతో కలిసి ఆరెంజ్,ఆలివ్,రోజ్ మొక్కలు నాటారు.. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి విద్యార్థులకు తెలియజేసారు.హరిత ప్రపంచానికి అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని రాజ్‌గ్రూప్, నిర్వాణం & నేహా ఎన్ టెక్నాలజీస్ నిర్వహించాయి.. జపాన్ లో […]
కోవాగ్జిన్ టీకాపై భారత్ బయోటెక్ కీలక ప్రకటన చేసింది. కోవిడ్ తీవ్ర లక్షణాలు సోకకుండా కోవాక్సిన్ 93.4 శాతం కాపాడుతుందని.. ప్రకటించింది భారత్ బయోటెక్. కోవాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయిల్ డేటాను లాన్‌సెట్ ప్రచురించిందని… క్లినికల్ ట్రాయల్స్ లో పాల్గొన్న వారిలో 0.5% కంటే తక్కువ మందిలో తీవ్ర దుష్పరిణామాలు ఉన్నాయని తెలిపింది. డెల్టా వేరియంట్ సోకకుండా 65.2 శాతం కాపాడగలదని పేర్కొంది భారత్ బయోటెక్. అన్ని రకాల కోవిడ్ స్ట్రైన్స్ నుంచి 70.8 శాతం […]
కుప్పం పర్యటనలో నారా లోకేష్ వైసీపీ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని… అడ్డగోలుగా తమపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అనంతపురంలో విద్యార్థులపై దాడి, అమరావతి రైతుల పై లాఠీఛార్జ్ అమానుష ఘటన అని ఫైర్ అయ్యారు.ఖాకీలు లేకుండా వైసిపి నేతలు బయటకు రాగలరా… ? వైసిపి నేతలు పిరికి వారు, పిల్లులు అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. తమ నాన్న చంద్రబాబు కాస్త సాఫ్ట్ అని.. కానీ తాను […]
మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అవుతుందని చెబుతారు. అక్కడ మాత్రం మంది ఎక్కువై.. ప్రొటోకాల్ సమస్యలు వస్తున్నాయి. ముందొచ్చిన చెవులు కంటే.. వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా మారింది సీన్. ఇంకేముంది.. ముందు నుంచీ జెండాలు మోసిన పాతకాపులు కుతకుతలాడుతున్నారట. పాత నేతలు వెనక బెంచీలకే పరిమితం..! తెలంగాణ బీజేపీలో ఒకప్పుడు చెప్పుకోదగ్గ నాయకులు నలుగురో.. ఐదుగురో ఉండేవారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చాక.. కాషాయ శిబిరంలో నేతల జాబితా పెరిగింది. వలస నాయకుల సంఖ్య ఎక్కువైంది. […]
ఏపీ టీడీపీ నేతలు ఉన్నట్టుండి నా గుణింతాన్ని వల్లె వేస్తున్నారా? బోస్‌డీకే అంటూ.. రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించిన పట్టాభి రీఎంట్రీ తర్వాత ఇది మరీ ఎక్కువైందా? కొత్త పల్లవిపై టీడీపీ వర్గాల స్పందనేంటి? నా గుణింతం వల్లె వేసిన పట్టాభి..! పార్టీ గొప్పదా.. వ్యక్తులు గొప్పా? ప్రస్తుతం టీడీపీలో ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. దీనికి కారణాలు లేకపోలేదు. బోస్‌డీకే అని విమర్శించి.. రాజకీయ వేడి రగిలించి.. జైలుకెళ్లొచ్చాక.. ఫ్యామిలీతోపాటు విదేశాల్లో రిలాక్స్ అయిన టీడీపీ నేత […]
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారులకు క్లియర్ టైటిల్‌తో రిజిస్ట్రేషన్ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి జాప్యం లేకుండా అప్రూవల్స్ ఇవ్వాలని… క్షేత్రస్థాయిలో ఎంక్వైరీలు కూడా.. నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తి చేయాలన్నారు. 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని… గ్రామ, వార్డు సచివాలయాల్లోనే […]
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ పారిశ్రామిక అభివృద్ధి కి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పారిశ్రామిక అభివృద్ధి పై కేంద్ర మంత్రి తో చర్చించామని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. బ్యాక్ లాగ్స్ విషయాలను కేంద్రం దృష్టికి తీసుకు వచ్చామని… దావోస్ ఈవెంట్ కు సిఎంకు ఆహ్వానం […]
దమ్ముంటే బీజేపీ నేతలు ఢిల్లీలో ధర్నా చేయాలని సవాల్ విసిరారు ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి. బీజేపీ రైతు అంశంపై కనీస అవగాహన లేకుండా ధర్నాలు చేస్తోందని… నిన్నటి వరకు 3550 కొనుగోలు కేంద్రాలను తెరిచామన్నారు. అన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయని…. కొన్న పంటలకు డబ్బులు రైతులకు ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు సోయి- జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని.. కనీస జ్ఞానం లేని వ్యక్తి బీజేపీ పార్టీ రాష్ట్ర […]
భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల కలెక్టర్లతో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప కలెక్టర్లు, అధికారులతో క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయని… తడ, సూళ్లూరుపేట, మరికొన్ని ప్రాంతాల్లో 20 సెం.మీ కన్నా ఎక్కువ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు సీఎం జగన్. నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని… ముఖ్యంగా […]