సాధారణంగా రోడ్డుపై వెళ్లే బైక్, కారు, ఇతర వాహనాలకు పంక్చర్లు అవుతుంటాయి. అలా జరిగినపుడు అవసరమైతే తోసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. అదే ఆకాశంలో ప్రయాణం చేసే విమానం టైర్‌కు పంక్చరైతే ఏంచేయాలి. రన్‌వే మీదున్న విమానం ముందుకు కదలాలి అంటే తప్పనిసరిగా టైర్లు ఉండాల్సిందే. పంక్చరైతే కనీసం కొంచెం కూడా ముందుకు కదలని పరిస్థితి వస్తుంది. దీంతో చేసేదిలేక విమానంలోని ప్రయాణికులంతా దిగి తలోచేయి వేసి ముందుకు తోశారు. Read: లైవ్: రోశయ్యకు ఘన నివాళి… […]
ఆర్సీబీకి బ్యాటింగ్ కోచ్ గా డివిలియర్స్ రాబోతున్నాడా.. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్‌తో ఇక క్రికెట్‌కు గుడ్ బై చెప్పేసిన ఏబీ.. ఇప్పుడు మళ్లీ ఆర్సీబీ జట్టుతోనే ఉండనున్నాడా.. ఆర్సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ అవుననే అంటున్నాడు. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పేశాడు. ఇక లీగ్స్ కూడా ఆడనని ప్రకటించాడు. ఈ మధ్యే దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్-14 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడాడు. ఆ తర్వాత […]
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా… మొన్న శుక్రవారం రోజున విడుదలైన సంగతి తెలిసిందే. హిట్ టాక్ రావడంతో ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు జనాలు. అటు సినిమా స్టార్లు అలాగే పొలిటికల్ లీడర్ లు కూడా ఈ సినిమాకు ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖ జిల్లాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. విశాఖ జిల్లా నర్సీపట్నం లోని ఓ థియేటర్ కు అఖండ సినిమా చూసేందుకు ఏకంగా అఘోరాలు వచ్చేశారు. శరీరానికి విభూతి.. అలాగే […]
మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి నివాళులు అర్పించారు. ఉభయ రాష్ట్రాలకు, తెలుగు ప్రజలకు రోశయ్యలేని లోటు తీరనిదని కిషన్ రెడ్డి అన్నారు. 1980లో శాసన మండలి సభ్యుడిగా ఉన్న సమయంలో తాను రెగ్యులర్‌గా శాసనమండలిలో రోశయ్య ప్రసంగాలు వీక్షించే వాడినని తెలిపారు. 2004 నుంచి 2014 వరకు శాసనసభలో కలిసి పనిచేశామని, ప్రతిరోజు రాజకీయంగా ఘర్షణ పడేవాళ్లమని, తాము రాజకీయ శతృవులము కాదని, తమకు రాజకీయ వైరుధ్యము మాత్రమే ఉందని తెలిపారు. […]
ఆంధ్రప్రదేశ్‌కు…జొవాద్ తుపాను ముప్పు తప్పింది. కోస్తాంధ్ర తీరానికి దగ్గర వచ్చినట్లే వచ్చి…దిశ మార్చుకున్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. జొవాద్ ప్రభావంతో ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయ్. మరోవైపు తుపాను ప్రభావంతో…దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విశాఖకు ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు, గోపాల్ పూర్ కు 310 కి.మీ దూరంలో జవాద్ తుపాను కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చిన అనంతరం […]
దేశీయ టెలీకాం కంపెనీలు నెలవారీ టారిఫ్ రేట్లను భారీగా పెంచాయి. 25 శాతం మేర టారిఫ్ రేట్లను పెంచడంతో వినియోగదారులు షాక్ అవుతున్నారు. గతంతో రూ.149 టారిఫ్ ఉన్న ఎయిర్‌టెల్ ప్యాకేజీ ఇప్పుడు రూ. 179కి చేరింది. అలానే, జియో, వొడాఫోన్ ఐడియాలు కూడా టారిఫ్ రెట్లను పెంచాయి. టారీఫ్ ధరలను పెంచినప్పటికీ అదనంగా ఎలాంటి ప్రయోజనాలను అందించలేదు. అయితే, బీఎస్ఎన్ఎల్ టారిఫ్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గతంలో ఉన్న టారిఫ్‌లను యధాతధంగా అందిస్తోంది. ఎయిర్‌టెల్, […]
తాలిబన్లు…క్రూరత్వానికి పరాకాష్ట. మధ్యయుగం నాటి సంప్రదాయాలను, ఛాందసవాదంతో అమలు చేసే పాలకులు. ఉగ్రవాదుల స్థానం నుంచి అఫ్ఘాన్ పాలకులుగా మారిన తాలిబన్లు.. ఆ తర్వాత తాము ప్రజాస్వామ్యంగా పాలిస్తామని హామీ ఇచ్చారు. అంతేనా ఎన్నో చెప్పారు.. కానీ తర్వాత్తర్వాత అవన్నీ తూచ్ అన్నారు. దీంతో అంతర్జాతీయ సమాజం.. తాలిబన్లను అనుమానంతో చూడడం మొదలు పెట్టింది. ఉగ్రవాదులుగా ఉండడం వేరు.. పాలించడం వేరు.. ఈవిషయం కాస్త ఆలస్యంగా తాలిబన్లకు అర్థమైంది. ఓవైపు కునారిల్లిన ఆర్థికవ్యవస్థ, ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి. […]
ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇండియా అలర్ట్ అయింది. కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్‌ను వేగం చేసింది. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇండియాలోనే జరుగుతున్న సంగతి తెలిసిందే. రోజుకు సగటున 50 లక్షలకు పైగా వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రయ మందకోడిగా సాగింది. ఎప్పుడైతే ఒమిక్రాన్ వేరియంట్‌ను వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించిందో అప్పటి నుంచి వ్యాక్సినేషన్‌ను మరింత వేగంవంతం చేశారు. Read: […]