జూనియర్ డాక్టర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై ఇవాళ ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ స్పందించారు. జూనియర్ డాక్టర్లకు 15 శాతం స్టైఫండ్ పెంచుతూ ఇవాళ ఉత్తర్వులు జారీ అవుతాయని ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. స్నేహ సోమారెడ్డి అనే వైద్యురాలు జూనియర్ డాక్టర్ల సమస్యలపై ఇవాళ కేటీఆర్‌కు ట్వీట్ చేసింది. దీంతో మంత్రి కేటీఆర్ ఆమె ట్వీట్ కు బదులు ఇచ్చారు. హౌస్ సర్జన్లు, పీజీ వైద్యుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానని… వారికి 15 శాతం స్టైఫండ్ పెంచాలని హెల్త్ సెక్రటరీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు కేటీఆర్. ఇవాళ జీవో విడుదల అవుతుందని కూడా మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్ అలా చేశాడో..లేదో.. మొత్తంగా ఇవాళ మధ్యాహ్నం 15 శాతం స్టైఫండ్ పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి.