సహజీవనంపై హర్యానా, పంజాబ్ హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సహజీవనం నైతికంగా, సామాజికంగా ఆమోదయోగ్యం కాదని పేర్కొంది హై కోర్టు. ఇంటి నుంచి పారిపోయిన ఓ జంట తమకు రక్షణ కల్పించాలని కోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా హై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషినర్లు గుల్జా కుమారి (19), గురువిందర్ (22) తార్న్ తరన్ జిల్లాకు చెందిన వారు. ఈ క్రమంలో వారు తాము కలిసి నివాసిస్తున్నామని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని పేర్కొన్నారు. గుల్జా కుమారి తల్లిదండ్రుల వల్ల తమకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాల్సిందిగా కోరుతూ.. కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్బంగా కోర్టు.. లివ్ ఇన్ రిలేన్‌షిప్(సహజీవనం) నైతికంగా, సామాజికంగా ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. సహజీవనం ఆమోదయోగ్యమైన విషయం కాదని పంజాబ్ అండ్ హర్యానా హై కోర్టు కొట్టేసారేసింది.