ఐదోసారి వరల్డ్ చెస్ చాంపియన్‌గా నిలిచాడు మగ్నస్ కార్లసన్. ఎనిమిదేళ్ల క్రితం వరల్డ్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించి అందర్నీ ఆశ్చర్యపర్చారు కార్లసన్. అప్పుడు అతని వయస్సు 22 ఏళ్లు. అప్పటికి విశ్వనాథన్ ఆనంద్ ఐదు సార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచాడు.
2013, 2014లో ఆనంద్‌ను ఓడించిన కార్లసన్, 2016లో కిరాకిన్‌ను, 2018లో కరువానాను ఓడించి టైటిల్ అందుకున్నాడు. తాజాగా, రష్యా గ్రాండ్ మాస్టర్ ఇయాన్ నెపోమ్‌నియాషిపై గెలిచి ఐదో సారి వరల్డ్ చాంపియన్‌గా నిలిచాడు. విశ్వనాథన్ ఆనంద్ రికార్డును సమం చేశాడు మగ్నస్ కార్లసన్.